దర్శకుడు మారుతి చిన్న లైన్ తో నిర్మాత తో కోట్లు ఖర్చు చేయించి ది రాజసాబ్ ని తెరకెక్కించారు, కానీ సినిమా టాక్ చూస్తే నిర్మాత మునిగిపోతాడు అని చాలామంది అనుకున్నారు కాదు కాదు ఓపెన్ గానే అన్నారు. కానీ ప్రభాస్ స్టామినా రాజసాబ్ ని చాలావరకు కాపాడింది. పాన్ ఇండియా లెవల్లో ఉన్న క్రేజ్ రాజాసాబ్ ని ఒడ్డున పడేసింది.
సంక్రాంతి సీజన్ లో విడుదలైన మన శంకర వరప్రసాద్ గారు, భర్తమహాశయులకు విజ్ఞప్తి, అనగనగ ఒక రాజు, నారి నారి నడుమ మురారి సినిమాలకు హిట్ టాక్ వచ్చినా రాజసాబ్ కి కలెక్షన్స్ ఈ రేంజ్ లో వస్తున్నాయి అంటే నిజంగా అది ప్రభాస్ కున్న క్రేజ్. అదే రాజసాబ్ ని కాపాడింది.. అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో కామెంట్లు చేస్తున్నారు.
నార్త్ లో రాజసాబ్ కి వర్కౌట్ అవ్వకపోయినా తెలుగులోనూ, తమిళ్, మిగతా పాన్ ఇండియా భాషల్లో రాజసాబ్ సేఫ్ గానే కనిపిస్తుంది.




ధనుష్ తో మృణాల్ పెళ్లి
Loading..