బాహుబలి తర్వాత నార్త్ బాక్సాఫీసు దగ్గర బలంగా జెండా పాతిన ప్రభాస్ ఆ తర్వాత సౌత్ లో నిరాశపరిచిన సాహో అక్కడ బాలీవుడ్ లో భారీగా వర్కౌట్ అయ్యింది. కేవలం ప్రభాస్ స్టామీనానే దానికి కారణం. ఆతర్వాత రాజసాబ్, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇవన్నీ నిరాశపరిచినా ఓపెనింగ్స్ పరంగా పర్వాలేదనిపించాయి. మళ్లీ సలార్, కల్కి చిత్రాలతో ప్రభాస్ ప్రూవ్ చేసుకున్నారు.
రీసెంట్ గా ప్రభాస్ నుంచి వచ్చిన చిత్రం ది రాజసాబ్. ఈ చిత్రం నార్త్ లో ప్రమోషన్స్ లేకుండానే విడుదలైంది. అయినప్పటికి ప్రభాస్ స్టామినాతో రాజసాబ్ కి ఓపెనింగ్స్ వస్తాయని మేకర్స్ అనుకున్నారు. కానీ రాజసాబ్ సందడి బాలీవుడ్ లో అస్సలు కనిపించలేదు. ప్రభాస్ నార్త్ ఆడియన్స్ ముందుకు వెళ్లకుండానే, ప్రమోషన్స్ చెయ్యకుండానే రాజసాబ్ వారి ముందుకు రావడం మైనస్ అయ్యింది.
ప్రభాస్ కి బాలీవుడ్ లో బాహుబలి తర్వాత చాలా తక్కువ ఓపెనింగ్స్ చిత్రంగా రాజసాబ్ నిలిచిపోతుంది. అందులోను ఇంకా ఇంకా ధురంధర్ అక్కడ దున్నేయ్యడం రాజసాబ్ కి సమస్యగా మారింది. ప్రమోషన్స్ లేక, మొదటి రోజు ఓపెనింగ్స్ రాక, సెకండ్ డే కలెక్షన్స్ పెరగక నార్త్ లో రాజా సాబ్ వీకైపోయింది.




శర్వా పక్కన సెట్ అవ్వలేదు
Loading..