ఈ సంక్రాంతి సీజన్ కి నిన్నటివరకు మాస్ సినిమాలు రావట్లేదు అనే దిగులుతో మాస్ ఆడియన్స్ కనిపించారు. ప్రతి ఏడు పెద్ద పెద్ద హీరోలు సంక్రాంతి సీజన్ లో కొట్లాడేవారు, కానీ ఈసారి కేవలం కామెడీ ఎంటెర్టైనెర్స్ మాత్రమే బాక్సాఫీసు బరిలోకి దిగుతుంటే కొంతమంది లో డిజప్పాయింట్మెంట్ కనిపించింది. మాస్ లేదు క్లాస్ లేదు ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ని క్యూ కట్టించేస్తున్నారు మన శంకర వరప్రసాద్ గారు.
నిన్న ఆదివారం సాయంత్రం నుంచే ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరు-అనిల్ రావిపూడి ల మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి మెగా అభిమానుల నుంచే కాదు కామాన్ ఆడియన్స్ నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మన శంకర వరప్రసాద్ గారు చుట్టూ పాజిటివ్ వైబ్స్ మాత్రమే కాదు ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే కథ ఉంది అంటున్నారు.
ఈ సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా మన శంకర వరప్రసాద్ కి క్యూ కట్టడం గ్యారెంటీ . సంక్రాంతి బెస్ట్ ఎంటర్టైనర్ ఈ మన శంకర వరప్రసాద్ గారు అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు.




నార్త్ లో ప్రభాస్ కి చుక్కెదురు
Loading..