యంగ్ హీరో శర్వానంద్ ఈ సంక్రాంతికి నారి నారి నడుమమురారితో రేపు బుధవారం భోగి రోజున రాబోతున్నాడు. వరస పరాజయాలతో ఉన్న శర్వానంద్ కి ఈ చిత్రం సక్సెస్ ఎంతో ఇంపార్టెంట్. అయితే నిన్నమొన్నటివరకు ప్రమోషన్స్ విషయంలో తడబడిన శర్వానంద్ సినిమా ఇప్పుడు క్రేజీగా మారిపొయింది. ఈ సినిమా ట్రైలర్ సినిమా పై ఉన్న ఒపీనియన్ ని మొత్తాన్ని మార్చేసింది.
అయితే నారి నారి నడుమ మురారి చిత్రంలో శర్వానంద్ తో ఇద్దరు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారు. నారి నారి అంటే ఇద్దరు ఉండాల్సిందేగా.. అందులో ఒకటి సాక్షి వైద్య, రెండోవారు సంయుక్త మీనన్. అయితే సాక్షి శర్వానంద్ కి జోడిగా బాగానే కనిపించినా సంయుక్త మీనన్ మాత్రం శర్వానంద్ పక్కన జోడిగా అస్సలు సెట్ కాలేదు.
అసలే శర్వానంద్ బాగా చిక్కిపోయాడు, సంయుక్త కాస్త బబ్లీగా ఉంటుంది. అందుకే సంయుక్త శర్వానంద్ కి అక్కగా కనిపించింది కానీ, రొమాన్స్ చెయ్యడానికి సెట్ కాలేదు అంటూ శర్వా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. శర్వానంద్ పక్కన నాజూగ్గా ఉన్న భామ అయితే సెట్ అయ్యేది. మరి దర్శకుడు అది చూసుకోవాలి కదా అనేది అభిమానుల బాధ.




రాజాసాబ్ - 3 రోజుల్లో 183 కోట్లు
Loading..