Advertisementt

మా ఇంటి బంగారం-చీరలో చితక్కొట్టిన సమంత

Fri 09th Jan 2026 11:52 AM
samantha  మా ఇంటి బంగారం-చీరలో చితక్కొట్టిన సమంత
Maa Inti Bangaaram Teaser Sparks Excitement మా ఇంటి బంగారం-చీరలో చితక్కొట్టిన సమంత
Advertisement
Ads by CJ

సమంత చాలారోజుల తర్వాత మా ఇంటి బంగారంతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో రాజ్ నిడిమోరు రైటింగ్ తో ట్రాలాల బ్యానర్ పై తెరకెక్కుతున్న మా ఇంటి బంగారం టీజర్ ని నేడు జనవరి 9 న వదిలారు. ఈ ఈవెంట్ కోసం సమంత తన భర్త రాజ్ నిడిమోరు తో కలిసి ముంబై నుంచి నిన్న రాత్రి హైదరాబాద్ వచ్చింది. 

తాజాగా విడుదలైన మా ఇంటి బంగారం టీజర్ లో సమంత పెద్దింటి కోడలిగా పద్దతిగా చీరకట్టులో కనిపించినా యాక్షన్ సీక్వెన్సులో కుమ్మేసింది. అది కూడా సమంత చీరకట్టులోనే విలన్స్ ని చితకబాదింది. ఈ టీజర్ లో సమంత యాక్షన్ మెయిన్ హైలెట్ గా నిలిచింది. 

చాలారోజుల తర్వాత సమంత స్క్రీన్ పై కనిపించేసరికి ఆమె అభిమానులు ఎగ్జైట్ అవుతూ కనిపించారు. అటు పెళ్లి తర్వాత సమంత చేస్తున్న మొదటి చిత్రం ఈ మా ఇంటి బంగారం. ఈ చిత్రంతో ఆమె సక్సెస్ అందుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. 

Maa Inti Bangaaram Teaser Sparks Excitement:

Samantha Maa Inti Bangaaram Teaser Released

Tags:   SAMANTHA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ