ఈరోజు జనవరి 9 న విడుదల కావాల్సిన విజయ్ జన నాయకన్ సినిమా సెన్సార్ కారణాలతో విడుదలను వాయిదా వేశారు మేకర్స్. ఇప్పటికే జన నాయకన్ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవడము, విజయ్ చివరి చిత్రం కావడంతో అభిమానులు సినిమా చూసేందుకు క్యూరియాసిటీతో ఎదురు చూడడంతో బుకింగ్స్ విషయంలో జన నాయకన్ రికార్డ్ క్రియేట్ చేసింది. సినిమా వాయిదా పడ్డాక ఆ మనీ మొత్తం థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకులకు రిఫండ్ చేసేశాయి.
ఇప్పుడు తాజాగా జన నాయకన్ కి కోర్టు క్లీయరెన్స్ ఇచ్చింది. విజయ్ జన నాయకుడు సినిమాకు మద్రాస్ హైకోర్టులో ఊరట, సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని CBFCని న్యాయస్థానం ఆదేశించింది, అసలు సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మళ్లీ రివ్యూ కమిటీకి పంపాల్సిన అవసరం ఏంటని సెన్సార్ కమిటీని హైకోర్టు ప్రశ్నించింది.
ముందుగా ఇస్తామన్న U/A సర్టిఫికెట్ సెన్సార్ బోర్డు తక్షణమే జారీ చెయ్యాలని కోర్టు ఆదేశం జారీ చేసింది.




మా ఇంటి బంగారం-చీరలో చితక్కొట్టిన సమంత 
Loading..