>ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని రామ్ చరణ్ దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. చిత్ర పరిశ్రమలో తండ్రిని మించిన తనయుడిగా ఎదుగుతున్నాడు. భవిష్యత్ లో హాలీవుడ్ కి సైతం వెళ్లేలా కనిపిస్తున్నాడు. చిరంజీవి అనే బ్రాండ్ తో చరణ్ సాధించాల్సిన దాని కంటే ఎక్కువగా సాధించాడు. తాజాగా తండ్రి కోసం తనయ కూడా రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. పెద్ద కుమార్తె సుస్మిత గోల్బ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణ సంస్థ ను స్థాపించి తొలి చిత్రాన్ని తండ్రితోనే నిర్మించారు.
>ఆ తొలి ప్రయత్నం ( మనశంకరవరప్రసాద్ గారు) సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయంపై ఎంతో ధీమాతో కనిపిస్తున్నారు. మరి గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ లో రెండవ సినిమా సంగతేంటి? అంటే ఇంత వరకూ ఎలాంటి అప్ డేట్ లేదు. ఏ హీరోతో పని చేస్తారు? ఎంత బడ్జెట్ లో నిర్మిస్తున్నారు? ప్రాజెక్ట్ లాక్ అయిందా? లేదా? ఏ వివరాలు సుస్మిత ఎక్కడా రివీల్ చేయలేదు. మరి ఏ హీరోతో ఛాన్స్ తీసుకుంటారో చూడాలి.
>మెగా ఫ్యామిలీలోనే చాలా మంది హీరోలున్నారు. రామ్ చరణ్ , వరుణ్ తేజ్, బన్నీ, సాయితేజ్, వైష్ణవ్ తేజ్ హీరోలగా రాణిస్తున్నారు. చరణ్, బన్నీ అగ్ర హీరోలగా రాణిస్తోన్న నేపథ్యంలో అప్పుడే వాళ్లని టచ్ చేసే అవకాశం లేదు. మిగతా హీరోలంతా సుస్మితకు అందుబాటులో ఉండేవారే. వాళ్లతో అయితే బడ్జెట్ లోనే సినిమా నిర్మించొచ్చు. కంటెంట్ ఉంటే ఇమేజ్ తో పనిలేకుండా సినిమాలు మంచి లాభాలు తెచ్చి పెడుతున్నాయి.
>కాబట్టి సుస్మిత హీరో కంటే కంటెంట్పై దృష్టి పెట్టి పని చేయగలిగితే మంచి ఫలితాలు సాధించొచ్చు. అలాంటి నిర్మా తలకు పరిశ్రమ సహ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతుంది. ఇప్పటికే సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్ గా ఆరితే రారు. చిరంజీవి సినిమాలకు తానే వ్యక్తిగతంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. మరి క్రియేటివ్ విభాగంలో సుస్మిత ఎంతటి ప్రతిభావంతురాలు? అన్నది నిరూపించుకోవాల్సిన సమయమిది.




దురంధర్ హవాకు సంక్రాంతి బ్రేక్
Loading..