దురంధర్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? హిందీ సినిమా సౌత్ హవాకు సంక్రాంతి సినిమాలు బ్రేక్ వేయబోతున్నాయా? అంటే.. అవుననే విశ్లేషణ సాగుతోంది.
రణ్ వీర్ సింగ్ దురంధర్ నగరాల వారీగా వసూళ్లు ట్రెండ్ పరిశీలిస్తే, 5వ వారం కూడా బెంగళూరు 80శాతం పైగా వసూలు చేస్తోంది. ఈ నగరంలో హిందీ వెర్షన్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. 4వ వారంలో కూడా ఇక్కడ చాలా షోలు `హౌస్‌ఫుల్` అయ్యాయి.హైదరాబాద్ లో 55 శాతం పైగా ఆక్యుపెన్సీతో దురంధర్ రన్ అవుతోంది. సంక్రాంతి సినిమాలు రాకముందు వరకూ ఈ హవాకు ఎదురుండదు. కానీ ఈనెల 9న రాజా సాబ్, 12న మన శంకరవరప్రసాద్ గారు రాకతో దురంధర్ సౌత్ హవాకు బ్రేక్ పడుతుందని అంచనా వేస్తున్నారు.
దురంధర్ చెన్నై వసూళ్లు ఆశ్చర్యకరంగా 80 శాతం ఆక్యుపెన్సీని చూపించడం... నిజంగా షాకిస్తోంది. ఉత్తరాది కంటే చెన్నైలో ఈ సినిమాకు ఎక్కువ ఆక్యుపెన్సీ నమోదవుతోంది. అయితే సంక్రాంతి బరిలో దిగుతున్న దళపతి విజయ్ జననాయగన్ దీనికి బ్రేక్ వేస్తుందని అంచనా వేస్తున్నారు. వసూళ్ల పరంగా దురంధర్ రణవీర్ కెరీర్‌లో బెస్ట్ మూవీగా నిలిచింది. ఉత్తరాదిన అత్యంత భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రానికి దక్షిణాది ప్రధాన నగరాల నుంచి చెప్పుకోదగ్గ వసూళ్లు దక్కాయని ట్రేడ్ చెబుతోంది. దురంధర్ దాదాపు 1200 కోట్లు వసూలు చేసి ఇప్పటికీ స్టడీగా కొనసాగుతోంది.




రాజసాబ్ పబ్లిక్ టాక్ 
Loading..