ఈరోజు జనవరి 9 న విడుదల కావాల్సిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ది రాజసాబ్ జనవరి 8 రాత్రి నుంచే ప్రీమియర్స్ తో మేకర్స్. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రాజసాబ్ చిత్రం పదే పదే వాయిదాల అంతరం నేడు విడుదలైంది. మరి సినిమాలో ఏ సీన్ నచ్చకపోయినా మా ఇంటికి రండి అంటూ ఛాలెంజ్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ కి సవాల్ విసిరాడు. మారుతి సవాల్ ని ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎలా స్వీకరిస్తారో చూడాలి.
ఏపీలో అడ్డంకి లేకుండా రాజసాబ్ ప్రీమియర్స్ నిర్వహించగా తెలంగాణాలో మాత్రం రాజసాబ్ ప్రీమియర్స్ కి నేడు విడుదలయ్యే థియేటర్స్ లో బుకింగ్స్ ఓపెన్ కాక అభిమానులు మంటెత్తిపోయి ఉన్నారు. మరోపక్క ఆంధ్ర, ఓవర్సీస్ రాజసాబ్ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు, ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా పై ఇస్తున్న పబ్లిక్ టాక్ తో అభిమానుల మొహం మాడిపోయింది.
ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం, కానీ రాజసాబ్ డిజప్పాయింట్ చేసింది అంటూ అభిమానులే మాట్లాడుతున్నారు. మారుతి మేకింగ్ కానీ, హీరోయిన్స్, సాంగ్స్, ఇలా ఏది ఆకట్టుకోలేదు అంటూ రాజసాబ్ చూసిన ప్రతి ఒక్కరు చెబుతున్న మాట. డార్లింగ్ ప్రభాస్ లెవల్ ఈ సినిమాలో లేదు, అంతా విఎఫెక్స్ వాడారు, యావరేజ్ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
నేను థియేటర్ లో నిద్రపోయాను, కొంచెం సీరియల్ టైప్ ఉంది సినిమా.. హార్డ్ కొర్ ఫ్యాన్స్ ఒకసారి చూడొచ్చు అంటూ కొంతమంది రాజసాబ్ పై రియాక్ట్ అవుతున్నారు.




సినీజోష్ రివ్యూ: ది రాజా సాబ్ 
Loading..