అవును నాని పదే పదే మాటిచ్చాడు. ది పారడైజ్ మార్చ్ 27 న విడుదల అంటూ చెబుతూ వచ్చారు నాని-దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. అదే రోజు పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్-బుచ్చి బాబు ల పాన్ ఇండియా మూవీ పెద్ది చిత్రం మార్చ్ 27 నే విడుదల అన్నారు. అయినప్పటికీ నాని పారడైజ్ తగ్గేదేలే అన్నారు. కానీ ఇప్పడు నాని-శ్రీకాంత్ ఓదెల ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారు.
ఎందుకంటే పారడైజ్ కి సంబందించిన ఇంకా 60 రోజులు టాకీ, సాంగ్స్ వర్క్ బాకీ ఉండడంతో మార్చ్ 27 న సినిమా విడుదల సాధ్యం కాదు, అందుకే నాని పారడైజ్ ఈ వేసవిలో విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. అఫీషియల్ స్టేట్మెంట్ కానప్పటికీ పారడైజ్ మూవీ మార్చ్ నుంచి సమ్మర్ కి వెళ్ళింది అనేది పక్కా.
నాని పారడైజ్ లో మాస్ లుక్ తో ఇరగదీస్తున్నాడు, ఎప్పటికప్పుడు పారడైజ్ ని వార్తల్లో ఉండేలా లుక్స్ వదులుతున్నారు. ఇక ఈ చిత్రంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ రోల్ ప్లే చేస్తున్న విషయం తెలిసిందే.




కొత్త ఏడాదిలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిగ్ స్టార్స్
Loading..