Advertisementt

కొత్త ఏడాదిలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల‌తో బిగ్ స్టార్స్

Wed 07th Jan 2026 10:14 AM
stars  కొత్త ఏడాదిలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల‌తో బిగ్ స్టార్స్
Back To Back Films from Star Heroes కొత్త ఏడాదిలో బ్యాక్ టూ బ్యాక్ చిత్రాల‌తో బిగ్ స్టార్స్
Advertisement
Ads by CJ

గ‌త ఏడాది స్టార్ హీరోలు న‌టించిన చిత్రాలేవి రిలీజ్ కాలేదు. దాదాపు స్టార్లు అంతా ఆన్ సెట్స్ లో ఉండ‌టంతో?  రిలీజ్ లు సాధ్య‌ప‌డ‌లేదు. కానీ 2026 లో మాత్రం అగ్ర హీరోలు కొంద‌రు రెండేసి చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే.. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టించిన `ది రాజాసాబ్` సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అవుతుంది. హిట్ పై టీమ్ అంతా ఎంతో ధీమాగా ఉంది.

ఈ సినిమా అనంత‌రం ఆగ‌స్టులో డార్లింగ్ న‌టిస్తోన్న` పౌజీ` కూడా రిలీజ్ అవుతుంది. స్వాతంత్య్ర‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ఆగ‌స్టు 15న  ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న రెండు చిత్రాలు రెండు..మూడు నెల‌ల గ్యాప్ లోనే రిలీజ్ అవుతున్నాయి. జ‌న‌వ‌రి 12న `మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` రిలీజ్ అవుతుంది. ఈసినిమా అనంత‌రం వేస‌వి కానుక‌గా ఏప్రిల్ లేదా మేలో `విశ్వంభ‌ర` కూడా రిలీజ్ కానుంది.

పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో జాప్యం కారణంగా వాయిదా ప‌డుతోన్న చిత్రాన్ని క‌చ్చితంగా వేస‌విలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అలాగే నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తోన్న `ది ప్యార‌డైజ్` మార్చిలో రిలీజ్ అవుతుంది. పోటీగా `పెద్ది `ఉన్నా నాని  ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ఇదే ఏడాది సుజిత్ ప్రాజెక్ట్ `బ్ల‌డీ రోమియో`ను కూడా ఏడాది ముగింపులో రిలీజ్ చేయాల‌న్న‌ది నేచుర‌ల్ స్టార్ ప్లాన్. `ప్యార‌డైజ్` రిలీజ్ అనంత‌రం ఈ సినిమా షూటింగ్ మొద‌ల‌వుతుంది.

అలాగే విక్ట‌రీ వెంక‌టేష్ కూడా మూడు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల మ‌ధ్య‌లోనే ఉంటారు. `మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ గారు` లో కీల‌క పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న `ఆద‌ర్శ‌కుటుంబం  హౌస్ 47`ని ఏడాది మిడ్ లో రిలీజ్ చేయాల‌న్న‌ది ప్లాన్. ఇప్ప‌టికే సినిమా సెట్స్ కు వెళ్లింది. అలాగే `దృశ్యం 3` ప్రాజెక్ట్ ని కూడా ప‌ట్టాలెక్కించ‌డానికి రెడీ అవుతున్నారు. మాతృక వెర్ష‌న్ ఇదే ఏడాది రిలీజ్ అవుతుండ‌టంతో?  తెలుగు వెర్ష‌న్  డిలేకి ఆస్కారం లేదు.

Back To Back Films from Star Heroes:

Star Heroes Double treat In 2026

Tags:   STARS
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ