అందం, అభినయం, ప్రతిభ, విజయం అన్నీ ఉన్నా? అదృష్టమే లేదన్నట్లు మీనాక్షి చౌదరి `సంక్రాంతి వస్తున్నాం` లాంటి బ్లాక్ బస్టర్ చేతిలో ఉన్నా నటిగా మాత్రం బిజీ కాలేకపోయింది. గత ఏడాదంతా అమ్మడు ఖాళీగానే ఉంది. ఏ భాషలో కూడా ఒక్క సినిమా కూడా చేయలేదు. తమిళ్, హిందీలో కూడా పని చేసింది గానీ అక్కడ కూడా ఒక్క ఛాన్స్ అదుకోలేకపోయింది. ఈ సంక్రాంతికి మాత్రం `అనగనగా ఒక రాజు`తో ప్రేక్షకుల ముందుకొస్తుంది.
అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే? అమ్మడు బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులు అందుకుంటుంది. గత ఏడాది విజయం కొత్త ఏడాదిలో అవకాశాలు తెచ్చి పెడుతున్నట్లు కనిపిస్తోంది. తాజాగా కోలీవుడ్ యువ హీరో ప్రదీప్ రంగనాధ్ కు జోడీగా ఓ సినిమాలో ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రదీర్ పరంగనాధ్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఓ చిత్రాన్ని స్వీయా దర్శకత్వంలో తెరకెక్కుస్తున్నాడు. ఇందులో హీరోయిన్ గా మీనాక్షిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంతో పాటు కోలీవుడ్ లోనే మరో రెండు చిత్రాలకు కూడా కమిట్ అయిందని సమాచారం. శివ కార్తికేయన్ హీరోగా త్వరలో ఓ సినిమా ప్రారంభం కానుంది. అందులో హీరోయిన్ గానే మీనాక్షినే తీసుకున్నారుట. అలాగే కార్తీ కథానాయకుడిగా రాజ్ కుమార్ పెరియాస్వామి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులోనూ మీనాక్షి హీరోయిన్ అనే వార్తలొస్తున్నాయి. అయితే వీటిపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది.
తెలుగులో నాగ చైతన్య హీరోగా నటిస్తోన్న `వృషకర్మ`లోనూ నటిస్తోంది. ఈ సినిమా గనుక విజయం సాధిస్తే టాలీవుడ్లో బిజీ అవ్వడానికి అవకాశాలున్నాయి. మీనాక్షి గత ఏడాదిలా కెరీర్ ని లైట్ తీసుకోలేదు. ఈ సారి అన్ని వైపులా అవకాశాల కోసం సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తోందని తాజా అప్ డేట్స్ ని బట్టి తెలుస్తోంది.




రవితేజ ని హీరోయిన్స్ గ్లామర్ కాపాడుతుందా 
Loading..