Advertisementt

కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లాంచ్

Sun 04th Jan 2026 08:46 PM
kalyan  కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లాంచ్
Kalyan Arts Productions Launch కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లాంచ్
Advertisement
Ads by CJ

తెలుగు సినీ పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో  కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో  కొత్త  బ్యానర్‌ను ప్రారంభించారు నిర్మాత కళ్యాణ్.   వినూత్న కథలు, కొత్త దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులకు అవకాశాలు కల్పిస్తూ కొత్త తరహా  సినిమాలను నిర్మించాలనే లక్ష్యంతో ఈ నిర్మాణ సంస్థ ముందుకు సాగుతోంది. 

ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తవాళ్లకు అవకాశాలు లభించడం కష్టంగా మారుతున్న నేపథ్యంలో, ప్రతిభ ఉన్న వారికి సరైన వేదిక కల్పించాలనే ఉద్దేశంతో కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌ను స్థాపించినట్లు నిర్మాత కళ్యాణ్ తెలిపారు.

కథే హీరో అన్న సిద్ధాంతంతో, వినూత్న కథలు, సమకాలీన అంశాలు, ప్రేక్షకులను ఆలోచింపజేసే మరియు అలరించే సినిమాలను నిర్మించడమే తమ లక్ష్యం అని నిర్మాత కళ్యాణ్ తెలిపారు. నిజమైన ప్రతిభకు సరైన వేదిక కల్పించాలనే బలమైన ఆలోచనతో కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఆవిర్భవించిందని, కొత్త దర్శకులు, కొత్త నటీనటులు, టెక్నీషియన్లకు అవకాశాలు ఇస్తూ, కంటెంట్‌ ఆధారిత  సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే సంకల్పంతో ఈ బ్యానర్ ను ప్రారంభించామని నిర్మాత కళ్యాణ్ అన్నారు. కొత్త ఆలోచనలకు స్వేచ్ఛ, క్రియేటివిటీకి పూర్తి ప్రాధాన్యం ఇస్తూ ప్రయోగాత్మక సినిమాలకు కూడా కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పెద్ద పీట వేయనుందని చెప్పారు. 

ఇప్పటికే కొన్ని ఆసక్తికర కథలు ఫైనల్ దశలో ఉండగా, తొలి సినిమా వివరాలను సంక్రాంతి సందర్భంగా ప్రకటిస్తూ రెగ్యులర్ షూటింగ్ ను కూడా స్టార్ట్ చేసేలా సన్నాహాలు చేస్తున్నామని తెలియజేశారు.

Kalyan Arts Productions Launch:

Kalyan Arts Productions Launch

Tags:   KALYAN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ