సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో గత ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి తదుపరి మరో సీనియర్ హీరో మెగాస్టార్ చిరు తో మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని ఏడు నెలల్లో పూర్తి చేసి ఈ సంక్రాంతికి తీసుకొచ్చేస్తున్నారు. మెగాస్టార్ వింటేజ్ లుక్, నయనతార హీరోయిన్ కావడం, అనిల్ రావిపూడి మేకింగ్ పై నమ్మకం, వెంకీ ఈ చిత్రంలో నటించడం వెరసి ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.
తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రం నుంచి మేకర్స్ ట్రైలర్ వదిలారు. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ లో మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ స్టయిల్, నయనతార లుక్స్, నయనతార కేరెక్టర్, వెంకీ ఎంట్రీ అన్ని అదిరిపోయాయని ఫ్యాన్స్ సంబరపడుతుంటే.. కామన్ ఆడియన్స్ మాత్రం మన శంకరవరప్రసాద్ గారు ట్రైలర్ పై మిక్స్డ్ రెస్పాన్స్ చూపిస్తున్నారు.
చిరంజీవి వింటేజ్ స్టయిల్ బావున్నా, ఆయన ఫేస్ లో గ్రెస్ లేదు, ఓవర్ ఎలివేషన్స్, ఆయన యాక్టింగ్ చూస్తుంటే చిరంజీవి ని అందరివాడు లో చూసినట్టుగా ఉంది, ఇక నయనతార కేరెక్టర్ చూడగానే కోలీవుడ్ లో అజిత్ విశ్వాసం గుర్తొచ్చింది. వెంకటేష్ ని సంక్రాంతికి వస్తున్నాం లో చూసినట్టుగానే ఉంది. మన శంకర వరప్రసాద్ గారు చిత్రం మొత్తం మిక్సీలో వేసి రుబ్బినట్టుగా ఉంది.
మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ ఓకే, ఓకే. సంక్రాంతి సీజన్ కాబట్టి సినిమా ఆడేస్తుంది. మ్యూజిక్ ఆల్బమ్ లో మీసాల పిల్ల హిట్, అలాగే మెగా-విక్టరీ సాంగ్ హిట్, అలా సినిమాకి భీమ్స్ మ్యూజిక్ ప్లస్ అవుతుంది అంటూ సాధారణ ప్రేక్షకులు మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ పై స్పందిస్తున్నారు.




కళ్యాణ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లాంచ్
Loading..