హీరో రవితేజ వరస ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నా ఆయనకు సక్సెస్ మాత్రం అందని ద్రాక్ష లా తయారైంది. వరస కమిట్మెంట్స్ తో వరసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ లో మాస్ జాతరతో వచ్చిన రవితేజ నాలుగు నెలలు తిరక్కుండానే ఈ సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి ని రెడీ చేసారు.
ఈ చిత్రంలో రవితేజ కామెడీ కేరెక్టర్ లో నవ్వించబోతున్నారు. హీరోయిన్స్ ఆషిక రంగనాధం, డింపుల్ హయ్యాతి లు అందాలు చూపించడంలో పోటీపడుతున్నారు. సాంగ్స్ లో ముఖ్యంగా వామ్మో వాయ్యో సాంగ్ లో ఇద్దరు హీరోయిన్స్ గ్లామర్ గా రెచ్చిపోయి రవితేజ తో కలిసి స్టెప్స్ వేస్తున్నారు. అది చూసిన నెటిజెన్స్ చాలా సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
#VammoVayyo song ఆషిక అందం, డింపుల్ సోయగం మాస్ మహరాజ్ రవితేజ ని కాపాడతాయా, ఈ గ్లామర్ భామలు రవితేజ కు విజయాన్ని అందిస్తారా అంటూ మాట్లాడుకుంటుంటే.. మిస్టర్ బచ్చన్, మాస్ జాతర లో హీరోయిన్స్ రెచ్చిపోయి గ్లామర్ చూపించినా వర్కౌట్ అవ్వలేదు. మరి ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి లో హీరోయిన్ గ్లామర్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.




రాజాసాబ్ పార్ట్ 2 పై దర్శకుడు కామెంట్స్ 
Loading..