జనవరి 9 న సంక్రాంతి స్పెషల్ గా విడుదల కాబోతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ పై మంచి అంచనాలున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ గత ఏడాది కాలంగా రాజాసాబ్ కోసం వెయిటింగ్, రిలీజ్ ట్రైలర్, మారుతి ఇంటర్వూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్ని రాజాసాబ్ ని ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆసక్తిని క్రియేట్ చేసాయి.
అయితే రాజసాబ్ ఒక భాగంగా విడుదలవుతుందా, లేదంటే రెండు భాగాలుగా ఉండబోతుందా.. అసలే సీక్వెల్ ట్రెండ్ నడుస్తుంది అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. బాహుబలి తర్వాత అందరూ పార్ట్-2 పై మోజుపడుతున్నారు. అలానే రాజసాబ్ విషయంలో మారుతి కూడా పార్ట్-2 ని ప్లాన్ చేశారేమో అనుకుంటున్నారు. మారుతి ని రాజాసాబ్ పార్ట్-2 గురించి అడిగితే..
రాజాసాబ్ ట్రైలర్లో చూసిన జోకర్ షాట్.. పార్ట్-2కు లీడ్ ఇవ్వడం కోసమే పెట్టినట్లు మారుతి చెప్పాడు. కానీ పార్ట్-2కు ఇంకా స్క్రిప్టు ఏమీ రెడీ కాలేదని, ప్రస్తుతానికి లీడ్ ఇస్తామని.. తర్వాత అన్నీ అనుకూలించడాన్ని(రాజాసాబ్ హిట్ పై) పార్ట్-2 ఉంటుందని మారుతి క్లారిటీ ఇచ్చాడు.




MSG ట్రైలర్ - మెగా-వెంకీ కాంబో కి విజిల్స్ 
Loading..