మెగాస్టార్ చిరంజీవి హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం సంక్రాంతి స్పెషల్ గా జనవరి 14 విడుదలవుతుంది. అనిల్ రావిపూడి చిత్రాల ప్రమోషన్స్ ఏంతో డిఫ్రెంట్ గా ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేవిలా ఉంటాయి. ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి అనిల్ రావిపూడి అదే పద్దతిని అప్లై చేస్తున్నాడు.
నేడు ఆదివారం అనిల్ రావిపూడి అండ్ టీమ్ శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకుని అక్కడ తిరుపతిలో మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్లోకి వెళితే.. మెగాస్టార్ మెగా స్వాగ్, ఆయన స్టైలిష్ యాక్షన్ తో ట్రైలర్ ఆరంభమై నయనతార తో గిల్లి కజ్జాలు, విక్టరీ వెంకటేష్ తో సరదా సంభాషణలు, మధ్యలో సీరియస్ నెస్ అన్ని మన శంకర వరప్రసాద్ గారు ట్రయిలర్ లో హైలెట్ అయ్యాయి.
చిరు-వెంకీ సీన్స్ కైతే ఆడియన్స్ విజిల్స్ వెయ్యాల్సిందే. వెంకీ హెలికాఫ్టర్ లో ఎంట్రీ సీన్ అయితే అదుర్స్. చూడడానికి మాంచి ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావ్.. ఇలా మాస్ ఎంట్రీ ఇస్తున్నావ్ ఏమిటి అంటూ చిరు అంటే.. దానికి వెంకీ మాస్ కే బాస్ లా ఉన్నావ్, నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి అంటూ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావాల్సిందే.
చిరు స్టైలిష్ లుక్స్, వెంకీ కేరెక్టర్, నయనతార లుక్స్ , కేరెక్టర్, అనిల్ రావిపూడి మేకింగ్ స్టయిల్, భీమ్స్ మ్యూజిక్, ముఖ్యంగా వెంకీ-చిరు సీన్స్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. పక్కా సంక్రాంతి కంటెంట్ ఈ మన శంకర వరప్రసాద్ గారు అంటూ కామన్ ఆడియన్స్ సైతం కామెంట్లు పెడుతున్నారు.




జన నాయకుడు తెలుగులో వర్కౌట్ అవ్వదు 
Loading..