కోలీవుడ్ హీరో విజయ్ హీరోగా హెచ్ వినోద్ తెరకెక్కించిన జన నాగయన్ చిత్రం బాలయ్య నటించిన భగవంత్ కేసరికి రీమేక్. ఈ విషయమేదో ఓపెన్ గా చెబితే తెలుగు ఆడియన్స్ జన నాయకుడు చిత్రాన్ని ఆదరించరని అనుకున్నారో లేదంటే వేరే విషయముందో తెలియదు కానీ.. జననాయకుడు చిత్రం భగవంత్ కేసరికి కి రీమేక్ అని చెప్పకుండా అంతా దాటేసారు.
తీరా సినిమా విడుదలకు ముందు జన నాయకుడు భగవంత్ కేసరికి రీమేక్ అని తెలిసిపోయింది. జన నాయకుడు ట్రైలర్ చూస్తే యాజిటీజ్ గా భగవంత్ కేసరి కి కాపీనే. సో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా, జన నాయకుడు చూస్తున్నంత సేపు భగవంత్ కేసరి నే చూస్తున్నట్టుగా ఉంటుంది.
అందుకే జన నాయకుడు తెలుగులో వర్కౌట్ అవ్వదు అనేది. మేకర్స్ కూడా ఈ సినిమాని తెలుగులో డబ్ చేస్తున్నా ప్రమోషన్స్ చెయ్యడం లేదు, చూసినోళ్లు చూస్తారు, లేని వాళ్ళు లేదు. సో తెలుగులో ప్రభాస్ రాజాసాబ్ హవా కి తిరుగుండదు, తమిళనాట జన నాయగన్ కు ఎదురు లేదు అంతే.




మోహన్ లాల్ కి షాకిచ్చి 100 కోట్లు కొట్టాడు 
Loading..