యానిమల్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ చేస్తున్నారు. రీసెంట్ గానే రెగ్యులర్ షూట్ కి వెళ్లిన స్పిరిట్ మూవీ నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభాస్ ఫ్యాన్స్ కి అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చాడు సందీప్ రెడ్డి వంగ. ప్రస్తుతం రాజసాబ్ ప్రమోషన్స్ తో ఎంజాయ్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి అనుకోని అతిథిలా స్పిరిట్ అప్ డేట్ వచ్చిపడింది.
డిసెంబర్ 31 మిడ్ నైట్ న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతూ స్పిరిట్ నుంచి ప్రభాస్ లుక్ ని రివీల్ చేసారు. స్పిరిట్ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ షర్ట్ లేకుండా ఒంటి మీద గాయాలతో, వాటికి కట్లు కట్టుకుని నోట్లో సిగరెట్ పెట్టుకొని ఉండగా పక్కనే తృప్తి డిమ్రి చీరలో ప్రభాస్ సిగరెట్ ని వెలిగిస్తూ నిల్చుంది.
మరి స్పిరిట్ పోస్టర్ చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఇంప్రెస్స్ అవుతుంటే.. కామన్ ఆడియన్స్ మాత్రం మరో యానిమల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదైనా ప్రభాస్ ని ఇలాంటి కల్ట్ లుక్ లో చూసాక ప్రభాస్ ఫ్యాన్స్ కి నిద్రపట్టదు.




శర్వా మురారి ఎక్కడా
Loading..