ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల ప్రమోషన్స్ జోరు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలుస్తుంది. ఏ మీడియా హ్యాండిల్ చూసినా ద రాజసాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగ ఒకరాజు ప్రమోషనల్ కంటెంటే కనిపిస్తుంది. కానీ జనవరి 14 న విడుదల అంటూ అనౌన్స్ చేసి సైలెంట్ అయిన శర్వానంద్ నారి నారి నడుమమురారి హడావిడి కనిపించడమే లేదు.
బైకర్ మాదిరి శర్వానంద్ నారి నారి నడుమ మురారి ని విషయంలో కూడా వెనక్కి తగ్గుతున్నాడా అనే అనుమానాలు మొదలయ్యాయి. కానీ జనవరి 14 న శర్వా నారి నారి నడుమ మురారి ఉంది, ప్రస్తుతం నిర్మాతలు బిజినెస్ చూసుకుంటున్నారు. కాకపోతే నారి నారి నడుమ మురారి ప్రమోషన్స్ మాత్రం మిగతా సినిమాలకన్నా వీక్ గా ఉన్నాయి.
మిగతా హీరోలు ఏజ్ తో సంబంధం లేకుండా ప్రమోషన్స్ తో అభిమానులకు కిక్ ఇస్తున్నారు. పబ్లిక్ లో ఎక్కువగా కనబడని ప్రభాస్ కూడా ద రాజసాబ్ ఈవెంట్ కి వచ్చేసారు. కానీ శర్వా నారి నారి నడుమమురారి టీజర్ దగ్గరే ఆగిపోయాడు. సంక్రాంతికి రిలీజ్ సినిమాల్లో నారి నారి నడుమమురారి మత్రమే సైలెంట్ గా కనిపిస్తుంది.




1000 కోట్ల డైరెక్టర్ ఐ ఆపరేషన్ సిందూర్ పైనా
Loading..