ఇటీవలే రిలీజ్ అయిన `ధురంధర్` ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పటికే 1000 కోట్ల క్లబ్లో చేరి పోయింది. `ధురంధర్` తదుపరి టార్గెట్ `ఆర్ ఆర్ ఆర్`, `కేజీఎఫ్` సాధించిన 1200 కోట్ల వసూళ్ల రికార్డను బ్రేక్ చేయడమే మిగిలింది. ఆ దిశగా ధురంధర్ దూసుకుపోతుంది. ఈ విజయంతో దర్శకుడు ఆదిత్య ధర్ పేరు దేశమంతా మరోసారి మారుమ్రోగిపోతుంది. `ధురంధర్ 2` విజయంతో ఆ క్రేజ్ రెట్టింపు అవుతుందని అంచనాలు బలంగా ఉన్నాయి.
దీంతో ఆదిత్యధర్ తదుపరి సినిమాపై అప్పుడే బాలీవుడ్ లో చర్చ మొదలైంది. వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ సోషల్ మీడియాలో అభిమానులు రెయిజ్ చేస్తున్నారు. ఎలాంటి సినిమా తీస్తాడు? ఎలాంటి కంటెంట్ ని తీసుకుంటాడు? అని ఒకటే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో `ఆపరేషన్ సిందూర్` అంశం తెరపైకి వస్తోంది. ఆదిత్య తదుపరి ఇదే కాన్సెప్ట్ తో సినిమా తీస్తాడని చర్చ జరుగుతోంది. పహాల్గం ఉగ్రదాడికి ప్రతి చర్యగా భారత్ `ఆపరేషన్ సిందూర్` పేరిట పాక్ ఉగ్రమూకల స్థావరాలను ధ్వంసం సంగతి తెలిసిందే.
రాత్రికి రాత్రే పైటర్ జెట్లతో కూల్చేసారు. దీంతో భారత్ ప్రతి దాడికి పాల్పడితే ఎలా ఉంటుందో మరోసారి శత్రుదేశానికి అర్దమైంది. ఈ దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం పెద్ద ఎత్తున పోటీ కనిపించింది. చాలా బాలీవుడ్ నిర్మాణ సంస్థలు టైటిల్ రిజిస్టర్ చేసాయి. ఇండియన్ మోషన్ పిక్చర్స్ లో జీ స్టూడియోస్, టీ సిరీస్ లాంటి కొన్ని సంస్థలు టైటిల్ రిజిస్టర్ చేసాయి. అలాగే ఉత్తమ నితిన్ కూడా ఇదే టైటిల్ తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.
దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. ఇలా రేసులో ఎంత మంది ఉన్నా? అదే కథను ఆదిత్య ధర్ డీల్ చేస్తే వచ్చే మైలేజ్ మరోలా ఉంటుంది. ఈ నేపథ్యంలో టైటిల్ లాక్ చేసిన నిర్మాణ సంస్థలు ఆదిత్యకు తమ సంస్థలో ఆఫర్ చేస్తున్నాయట. ఈ విషయంలో ఆదిత్య కూడా సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదిత్య ధర్ తొలి సినిమా `యూరి`తోనే ఓ సంచలనమైన సంగతి తెలిసిందే.




ప్రభాస్ బాడీ డబుల్ పై మారుతి కామెంట్స్
Loading..