2026 సంక్రాంతి చాలా చప్పగా కనిపిస్తుంది. జనవరి 9న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన హర్రర్ కామెడీ ద రాజసాబ్ తో రాబోతున్నారు. ఆ తర్వాత జనవరి 12 న మెగాస్టార్ చిరు మన శంకర వరప్రసాద్ గారు రాబోతున్నారు. ఇది కూడా కామెడీ ఎంటెర్టైనర్ కావడం గమనార్హం, ఇక తర్వాత రోజు జనవరి 13 న రవితేజ కూడా కామెడీ ఎంటర్టైనర్ భక్త మహాశయులకు విజ్ఞప్తి తో రాబోతున్నారు.
జనవరి 14 న నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రోజు, శర్వానంద్ నారి నారి నారి నడుమమురారి రెండు సినిమా లు కామెడీ జోనర్ వె. సో ఈ సంక్రాంతికి మాస్ యాక్షన్ ఎంటెర్టైనెర్స్ ఏవి రావడం లేదు, మాస్ ఆడియన్స్ కి ఈ సంక్రాంతి డిజప్పాయింట్ అనే చెప్పాలి. అదే బాలయ్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు వేస్తున్నారు.
ఈ సంక్రాంతికి పోటీ గా బాలయ్య సినిమా లేక పోయేసరికి, మెగా ఫ్యాన్స్ #ManaShankaraVaraPrasadGaru ను సరిగా పట్టించుకోవటం లేదు.. అదే బాలయ్య బాబు సినిమా సంక్రాంతి కి ఉండుంటే, ఈ పాటికి తెగ హడావుడి చేసే వాళ్ళు.. ఏదైనా సంక్రాంతి అంటే బాలయ్య vs చిరు నే.. అంటూ మాట్లాడుకుంటున్నారు. అది నిజమే. చిరు, బాలయ్య బాకాఫీసు పోటీ నిజంగా వేరే లెవల్ అనేలా అభిమానులు కొట్టేసుకునేవారు.




స్పిరిట్ - ఆజానుబాహు ప్రభాస్
Loading..