కంప్లీట్ స్టార్ మోహన్ లాల్ పాన్ ఇండియా ప్రయత్నాల గురించి చెప్పాల్సిన పనిలేదు. `బాహుబలి` స్పూర్తితోనే లాల్ సాబ్ కూడా ఎక్కడా తగ్గడం లేదు. `బాహుబలి` రేంజ్ పాన్ ఇండియా హిట్ కోసం కొన్ని సంవ్సతరాలుగా శ్రమిస్తున్నారు. 100 కోట్ల వ్యవయంతో `మరాక్కర్: లయన్ ఆఫ్ ది ఆరేబియన్ సీ` అనే హిస్టారికల్ యాక్షన్ చిత్రం చేసారు. ప్రియ దర్శన్ తెరకెక్కించిన సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైన వాటిని అందుకోవడంలో విఫలమైంది.
అటుపై మూడేళ్లు గ్యాప్ తీసుకుని మోహన్ లాల్ మరో ప్రయత్నం చేసారు. అదే `మలైకోటి వాలిబన్`.పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా 65 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కించారు. రిలీజ్ కుముందు ప్రచార చిత్రాలు మంచి హైప్ తీసుకొచ్చాయి. కానీ పాన్ ఇండియా రిలీజ్ తర్వాత సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచేసారు. ఇలా రెండు పాన్ ఇండియా సినిమాలు మోహన్ లాల్ కి ఆరంభంలోనే దెబ్బకొట్టాయి.
అయినా లాల్ ఎక్కడా రాజీ పడలేదు. రెట్టించిన ఉత్సాహంతో పని చేసారు. ఈసారి మాత్రం గ్యాప్ తీసుకోకుండానే `బరోజ్` అనే చిత్రాన్ని ఏకంగా 3డీలో చేసే రిలీజ్ చేసారు. ఈ సినిమాకు 180 కోట్ల వరకూ ఖర్చు చేసారు. గత పాన్ ఇండియా పరాజయాలన్నీ ఈ సినిమా వసూళ్లతో బ్రేక్ చేస్తుందని భారీ ఎత్తున రిలీజ్ చేసారు. కానీ ఈ సినిమా కూడా నిరుత్సాహాన్నే మిగిల్చింది. అయినా వెనక్కి తగ్గలేదు. ఇటీవలే ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన `వృషభ` రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
మలయాళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కించి రిలీజ్ చేసిన చిత్రమిది. కానీ మరోసారి నిరాశే ఎదురైంది. ఇలా మోహన్ లాల్ చేసిన నాలుగు పాన్ ఇండియా ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. ఈ నేపథ్యంలో తదుపరి మరో పాన్ ఇండియా సినిమా చేస్తారా? గత అనుభవాల నేపథ్యంలో వెనక్కి తగ్గుతారా? అన్నది చూడాలి.




స్టార్ మా ను అవాయిడ్ చేస్తున్న తనూజ
Loading..