బిగ్ బాస్ లో విన్నర్ అవుతానని భ్రమపడి రన్నర్ గా మిగిలిన తనూజ ఓటమిని ఆమె తో పాటుగా ఆమె అభిమానులు తీసుకోలేకపోతున్నారు. లేడీ టైగర్ గా హౌస్ లో పోరాడిన తనూజ ను డీ ఫేమ్ చేసేందుకు వైల్డ్ కార్డు ఎంట్రీలు, అలాగే బయట ఆమె తోటి నటులు చాలానే కష్టపడ్డారు. అయినప్పటికీ తనూజ డిమోన్ పవన్, ఇమ్మాన్యుయేల్ లాంటి వాళ్ళను దాటుకుని రన్నర్ గా గెలవడమే కాదు విన్నర్ కళ్యాణ్ గెలుపు కారణమైంది.
అయితే తనూజ మాత్రం తనకు డబ్బు ముఖ్యంగా కాదు టైటిల్ ముఖ్యం, మా నాన్నగారి చేతిలో బిగ్ బాస్ టైటిల్ పెట్టి ప్రొఫెషన్ మారినా మీ కూతురు మాత్రం మారదు, ఇది మీ కూతురు అని చెప్పాలనుకున్నాను అంటూ తనూజ బిగ్ బాస్ బజ్ లో చెప్పి ఎమోషనల్ అయ్యింది. అయితే తనూజ రన్నర్ గా నిలిచిన సందర్భంలో బిగ్ బాస్ యజమాన్యం ఆమెకు పారితోషికం పెంచినట్లుగా, కెమెరా మ్యాన్స్ కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
అయితే తనూజ రన్నర్ అయ్యాక మిగతా హౌస్ మేట్స్ తో కలిసి కనిపించలేదు, ఆఖరికి స్టార్ మా బిగ్ బాస్ తర్వాత స్టార్ మా పరివార్ లోకి కూడా తనూజ రాలేదు, మరి తనూజ ఏమైనా స్టార్ మా ని అవాయిడ్ చేస్తుందా, స్టార్ మా పై అలిగిందా అనే అనుమానం అందరిలో మొదలైంది. అయితే స్టార్ మా పరివార్ ప్రోమో వదిలిన రోజే తనూజ ఓ శారీ స్టార్ ఓపెనింగ్ కి వెళ్ళింది.
అది చూసిన తనూజ అభిమానులు నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు(స్టార్ మా పరివార్ లో కళ్యాణ్, డిమోన్ పవన్, రీతూ, ఇమ్మాన్యుయేల్, భరణి, దివ్యలను) ఒక వైపు అంటూ కామెంట్లు పెడుతున్నారు.




హనీమూన్ లో సమంత-రాజ్ నిడిమోరు
Loading..