నటుడు నాగ చైతన్య ను ప్రేమించి పెద్దల అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్న సమంత పెళ్ళైన నాలుగేళ్లకు నాగ చైతన్య తో విడాకులు తీసుకుని ఆ తర్వాత సోలో లైఫ్ లో హెల్త్ రీజన్స్ తో సఫర్ అయ్యి దర్శకుడు రాజ్ నిడిమోరు కు దగ్గరైంది. రాజ్ నిడిమోరు తో డేటింగ్ చేస్తున్న సమంత సడన్ గా ఈ ఏడాది సింపుల్ గా భూత శుద్ధి పద్ధతిలో వివాహమాడింది.
పెళ్లి తర్వాత సమంత షూటింగ్స్ లో బిజీ అయ్యింది. ఆమె నటిస్తున్న మా ఇంటి బంగారం షూటింగ్ తో పాటుగా షాప్ ఓపెనింగ్స్ తో బిజీగా కనబడింది. పెళ్లి తర్వాత రాజ్ నిడిమోరు తో కలిసి సమంత హనీమూన్ కి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు సమంత రాజ్ నిడిమోరుతో కలిసి హనీమూన్ ట్రిప్ వేసింది.
సమంత-రాజ్ నిడిమోరు జంట హనీమూన్ కి పోర్చుగల్ దేశానికి వెళ్లారు. అక్కడ అరుదైన లొకేషన్స్ లో ఎంజాయ్ చేస్తూ సమంత దిగిన పలు ఫోటోలు, రాజ్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆ ఫొటోస్ లో ఎక్కడా సమంత-రాజ్ నిడిమోరు లు కలిసి కనిపించలేదు. అదే అభిమానులను కాస్త బాధపెట్టింది.
ఇక పోర్చుగల్ లోనే కొత్త జంట సమంత-రాజ్ లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.




క్రికెటర్ని కెలికి కామెడీ అయిపోయిన నటి
Loading..