క్రికెటర్ రిషబ్ పంత్ తన కోసం పడి చచ్చిపోయేవాడని, హోటల్ గది లాబీలోనే గంటల కొద్దీ సమయం తనకోసం వేచి చూసేవాడని వ్యాఖ్యానించిన ఊర్వశి రౌతేలా ఆ తర్వాత చాలా ట్రోలింగ్ ని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రిషబ్ తో ఊర్వశి వాగ్వాదం కొన్ని నెలల పాటు కొనసాగింది. ఇప్పటికీ ఊర్వశిపై రిషబ్ అభిమానులు మీమ్స్ తో విరుచుకుపడుతూనే ఉన్నారు.
ఆ ఘటనను మరువక ముందే, ఇప్పుడు ఖుషీ బెనర్జీ అనే ఒక టీవీ మూవీ నటి, టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తనకు మెసేజ్‌లు పెట్టేవాడని మీడియా ఎదుట వ్యాఖ్యానించడం పెను దుమారం రేపింది. తాను క్రికెటర్లను ప్రేమించలేదని, తనకు లింకప్ వార్తలు నచ్చవని వ్యాఖ్యానించిన అమ్మడు .. ఆ క్రికెటర్ ఎవరో కానీ అంటూ సూర్య కుమార్ యాదవ్ తనకు మెసేజ్ లు పంపేవాడని నవ్వేస్తూ వ్యాఖ్యానించింది.
కానీ దీనిని సూర్యకుమార్ ఫ్యాన్స్ తేలిగ్గా తీసుకోలేదు. ఖుషీ ముఖర్జీపై చాలా హాస్యచతురతతో స్పందించారు. మా ఆఫీస్ బోయ్ సూర్యకుమార్ ఆమెకు మెసేజ్‌లు పంపి ఉండొచ్చు అని ఒక నెటిజన్ వ్యాఖ్యానించగా, కచ్ఛితంగా సూర్య ఫేక్ ఐడీ నుంచి ఆ మెసేజ్ లు వెళ్లి ఉంటాయి! అని మరొకరు కామెడీ చేసారు. సూర్యకు మరీ అంత దిగజారిపోయిన రోజుల్లేవ్ అని ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి సూర్యకుమార్ యాదవ్ సదరు నటీమణి వ్యాఖ్యలకు స్పందించే స్థితిలో లేడు. అతడు తన అందమైన భార్యతో కలిసి తిరుమల వెంకన్న సామి దర్శనానికి వెళ్లారు. వైకంఠ ఏకాదశి వేళ తిరుమలకు భక్తులు పోటెత్తిన సంగతి తెలిసిందే.




2026 కి స్వాగతం చెబుతున్న చిత్రాలు
Loading..