ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక పేదలకు, పెద్దలకు పెన్షన్ పెంచి ఒకేసారి మూడు నెలల పెన్షన్ ను ఇచ్చి చరిత్ర సృష్టించారు. నెలకు నాలుగు వేల పెన్షన్ ను ఇస్తూ వస్తున్నారు. ప్రతి నెల 1 వ తారీఖు వచ్చింది అంటే సీఎం చంద్రబాబు స్వయంగా ఓ గ్రామానికి వెళ్లి అక్కడ పెన్షన్ కు అర్హులైన ఓ కుటుంబాన్ని కలిసి పెన్షన్ ఇవ్వడమే కాదు కూటమి ప్రభుత్వ మంత్రులు, ఎమ్యెల్యేలు, కార్యకర్తలు అందరూ ప్రతినెలా ఒకటో తారీఖు ఈ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
అయితే రేపు జనవరి 1, న్యూ ఇయర్ కావడంతో ఏపీ ప్రభుత్వం ఒక అడుగు ముందే వేసి డిసెంబర్ 31 నే అంటే ఈరోజే అర్హులకు పెన్షన్స్ ను అందజేస్తుంది. ప్రతి గ్రామంలో 1 వ తారీఖు కన్నా ముందే పెన్షన్ పంపిణి కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ప్రజలే దేవుళ్ళు, ప్రజలే కోసమే ప్రభుత్వం అన్నట్టుగా కూటమి ప్రభుత్వం పేదలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తుంది.
మరి ఏపీ లోని పెన్షన్ దారులకు న్యూ ఇయర్ ఒక రోజు ముందే వచ్చేసింది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి పెన్షన్ కార్యక్రం ఈరోజు డిసెంబర్ 31 న ముమ్మరంగా సాగుతుంది.




దూసుకొస్తాడా.. వెనక్కి తగ్గుతాడా..
Loading..