ఏపీ లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ డబ్బు వెనకేసుకుంటున్నారు అంటూ వైసీపీ నేతలైన రోజా, అంబటి లాంటి నేతలు ఎప్పటికప్పుడు పవన్ పై నోరు పారేసుకుంటూ ఉంటారు. పవన్ కళ్యాణ్ మొహానికి మేకప్ వేసుకుంటారు, ఈయనేం డిప్యూటీ సీఎం అంటూ..
చాలామందిలో కూడా ఇలాంటి ఆలోచనే ఉండొచ్చు.. పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుని ఆస్తులను కూడబెట్టుకుంటారు అని. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు చేసుకుని డబ్బు ని వెనకేసుకోవడానికి కాదు, ఆస్తులు కూడబెట్టుకోవడానికి అసలే కాదు, ఆయన పార్టీని నడిపించుకోవడాని, అలాగే ప్రజలకు తన వంతు సహాయం చెయ్యడానికి, అదే ఆయన ఎప్పటికప్పుడు చెబుతున్నది. పవన్ కళ్యాణ్ తాజాగా పవన్ మీడియాతో మట్లాడుతూ నేను అధికారంలోకి రాకముందు ఇదే ముక్కోటి ఏకాదశి రోజున ఒక సినిమాకి సైన్ చేశాను.
అప్పుడే రాష్ట్రంలోని కౌలు రైతుల ఆత్మహత్యల గురించి మనోహర్ గారు చెప్పారు, నేను వారికి ఏదైనా చేయాలనుకున్నాను, వారి ఆత్మహత్యలు నన్ను కలిచివేసింది. ప్రభుత్వాల మీద ఒత్తిడిపెట్టగలమా అని ఆలోచించి.. ఎంతోకొంత సహాయం చేద్దామనుకున్నాను, ఆ రోజే నేను సైన్ చేసిన సినిమాకి నాకు ఐదు కోట్ల అడ్వాన్స్ ఇచ్చారు. దానితో ఆ ఐదు కోట్లను రైతులకు ఇచ్చేసాను, అలా ఎంతోమంది దాతలు కలిసి దాదాపు మూడేవేల మంది పైచిలుకు రైతులను ఆదుకున్నాము అంటూ పవన్ చెప్పారు.
మారి ఇది విన్నాక పవన్ పై నోరు పారేసుకునేవారు ఆ నోరు మూసుకుంటే మంచిది, పవన్ సినిమాలు చేసినా, ఏది చేసినా అది ఏపీ ప్రజల కోసమే, ఇకపై నోరు జారకండి అంటూ పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.




ప్రభాస్ ఫ్యాన్స్ అతిగా ఆశపడుతున్నారా
Loading..