కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాల నుంచి తప్పుకుంటున్నట్టుగా జన నాయగ న్ చిత్ర ఆడియో లాంచ్ ఈవెంట్ లో అనౌన్స్ చేసారు. జన నాయగన తన చివరి చిత్రమని చెప్పిన విజయ్ ఇకపై ప్రజల కోసం సేవ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. మలేషియా లో విజయ్ జన నాయగన్ ఆడియో వేడుకను నిర్వహించారు మేకర్స్.
ఆడియో లాంచ్ వేడుక పూర్తి అయ్యాక విజయ్ మలేషియా నుంచి చెన్నై కి పయనమయ్యారు. చెన్నై ఎయిర్ పోర్ట్ కి వస్తున్న విజయ్ ని చూసేందుకు, స్వాగతం పలికేందుకు ఆయన అభిమానులు వేలాదిగా చేరుకున్నారు, పోలీసులు కంట్రోల్ చేస్తున్నా విజయ్ అభిమానులు విజయ్ మీదకి తోసుకొచ్చారు.
దానితో విజయ్ అందరికి అభివాదం చేసుకుంటూ కారు వద్దకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అభిమానులు ముందుకు రావడంతో విజయ్ కిందపడ్డారు. పక్కనే ఉన్న సెక్యూరిటీ ఆయన్ను సురక్షితంగా కారు ఎక్కించడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం విజయ్ ఎయిర్ పోర్ట్ వీడియో వైరల్ అవుతోంది.




రాజాసాబ్- డ్యూటీ దిగిపోయిన ప్రభాస్
Loading..