శ్రీకాంత్ తనయుడు రోషన్ కటౌట్ కి తగ్గ కంటెండ్ పడటం లేదు. అలాంటి స్టోరీ ఒకటి పడిన రోజున రోషన్ ఓవర్ నైట్ లోనే మంచి స్టార్ అవుతాడు? అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకోసం రోషన్ ప్రయత్నిస్తున్నా? ప్లాన్ అనుకున్న విధంగా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాడు. ఇటీవలే `ఛాంపియన్` తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మిక్సుడు రివ్యూలు వచ్చాయి. కానీ లుక్ పరంగా..కొన్ని సన్నివేశాల పరంగా ఎంతో మెరుగ్గా కనిపించాడు.
కానీ ప్రేక్షకుల్లో ఇంకా ఏదో అసంతృప్తి. రోషన్ నుంచి అంతకు మించి ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా రోషన్ కోసం బడా నిర్మాతలే రంగంలోకి దిగుతున్నారు. ఇంతకాలం సైలెంట్ గా ఉన్నా? `ఛాంపియన్` తెచ్చిన ఇమేజ్ బడా నిర్మాతల్లో ఓ నమ్మకాన్ని ఏర్పరించింది. ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ రోషన్ తో ఓ సినిమాకు అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? ఎలాంటి స్టోరీతో వస్తున్నాడు? అన్నది క్లారిటీ లేదు.
కానీ నిర్మాత నాగవంశీ మాత్రం రోషన్ ని తాను అనుకున్న విధంగా ప్రజెంట్ చేయాలని కసి పట్టుదలతో ఉన్నాడు. స్టోరీలు సెలక్షన్ పరంగా నాగవంశీ కాస్త ఇన్నో వేటివ్ గా ఉంటాడు. ఈ నేపథ్యంలో రోషన్ విషయంలో యూనిక్ గా ఉంటాడు? అనే నమ్మకం అభిమానుల్లో ఉంది. అలాగే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా రోషన్ తో సినిమా నిర్మించడానికి ముందుకొచ్చారు. `ఛాంపియన్` సినిమా చూసిన తర్వాత అరవింద్ తీసుకున్న నిర్ణయం ఇది.
రామ్ చరణ్ అన్నట్లు! యూరోపియన్ యాక్షన్ స్టార్ లా ఉన్నాడు? అన్నది అరవింద్ గారి అభిప్రాయంగానూ కనిపిస్తోంది. అందుకే అరవింద్ కూడా సీన్ లోకి వచ్చారు. రోషన్ కి ఇంతకాలం సరైన బ్యానర్లో కూడా పడలేదు. ఇప్పుడా ఛాన్స్ వచ్చింది. నటుడిగా ప్రూవ్ చేసుకోవడానికి...సక్సెస్ అవ్వడానికి ఇది మంచి అవకాశం. ఈ రెండు బ్యానర్లలో సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నాడు? అంటే రోషన్ తిరుగులేని స్టార్ అవుతాడు.




ఎయిర్ పోర్ట్ లో కిందపడిన హీరో విజయ్ 
Loading..