ద రాజ్ సాబ్ జనవరి 9 న విడుదలకు సిద్దమవుతుంది. సంక్రాంతి పోరులో మొదటి చిత్రంగా రాబోతుంది. రీసెంట్ గానే రాజసాబ్ ఈవెంట్ లో అభిమానుల సమక్షంలో ప్రభాస్ సందడి చేశారు. అయితే ఇకపై ప్రభాస్ రాజా సాబ్ ప్రమోషన్స్ లో కనిపించరు. రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయ్యింది, ప్రభాస్ రాజాసాబ్ డ్యూటీ దిగేసారు.
ఇక అంతా థమన్ దే బాధ్యత అన్నట్టుగా నిజంగానే మేకర్స్ పై భారం వేసి ప్రభాస్ విదేశాలకు చెక్కేస్తున్నారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కోసం ప్రభాస్ ఇటలీ వెళ్ళబోతున్నారు. అక్కడ స్నేహితులతో కలిసి సంక్రాంతి వరకు ఎంజాయ్ చేసి ఆతర్వాత మళ్లి తిరిగి ఇండియాకి వస్తారని తెలుస్తుంది.
సో స్పిరిట్ షూట్ కి బ్రేకిచ్చిన ప్రభాస్ రాజాసాబ్ ప్రమోషన్స్ లో కనిపిస్తారు అనుకుంటే జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ముగించెయ్యడం అభిమానులను నిరాశ పరిచినా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించడం కాస్త ఊరటనిచ్చింది. ఇదే ఉత్సాహాన్ని ఊపుని ఫౌజీ వరకు కొనసాగిస్తామని వారు మాట్లాడుకుంటున్నారు. సో ప్రభాస్ ఓ 15 రోజులు ఎవ్వరికి కనబడరన్నమాట.




బయట కూడా జంటగానే కనిపిస్తున్నారు
Loading..