Advertisementt

వ‌చ్చే ఐదేళ్లు బ‌న్నీ ప్లానింగ్ ఇలా

Sun 28th Dec 2025 09:49 AM
allu arjun  వ‌చ్చే ఐదేళ్లు బ‌న్నీ ప్లానింగ్ ఇలా
This is Bunny plan for the next five years వ‌చ్చే ఐదేళ్లు బ‌న్నీ ప్లానింగ్ ఇలా
Advertisement
Ads by CJ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్లీ తో క‌లిసి తొలిసారి ఓ  గ్లోబ‌ల్ అటెంప్ట్ మూవీ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. టెక్నిక‌ల్ కాన్పెప్ట్ కి అట్లీ మార్క్ క‌మ‌ర్శియాల్టీని జొప్పించి తెర‌కెక్కిస్తోన్న చిత్రం. పాన్ ఇండియాలో ఇప్ప‌టికే బ‌న్నీ ఏటో ప్రూవ్ చేసుకున్న నేప‌థ్యంలో త‌ర్వాత సినిమా గ్లోబ‌ల్ స్థాయిలోనే ఉండాల‌ని ఇరువురు చేతులు క‌లిపి ప‌ట్టాలెక్కించిన ప్రాజెక్ట్. అందుకు త‌గ్గ‌ట్టే  సినిమా పై అంచ‌నాలు అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి.

ఈ చిత్రం అన్ని ప‌న‌లు పూర్తి చేసుకుని ఈ ఏడాది  ముగింపులో లేదా? వచ్చే  ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా స‌క్సెస్ అనంత‌రం బ‌న్నీ ప్లానింగ్ అంతా కూడా గ్లోబ‌ల్ స్థాయిలోనే క‌నిపిస్తుంది. ఆ రేంజ్ కాన్సెప్ట్ లు చేసే ఆలోచ‌ల‌నతో త‌దుప‌రి చిత్రాల ద‌ర్శ‌కుల్ని లైన్ లో పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఓసారి ఆ వివ‌రాల్లోకి వెళ్తే అట్లీ సినిమా నుంచి బ‌య‌ట‌కు రాగానే  త్రివిక్ర‌మ్ చిత్రం ప‌ట్టాలెక్కుతుంది.

ఇప్ప‌టికే స్టోరీ లాక్ అయి సిద్దంగా ఉన్న చిత్ర‌మిది. ఇదోక మైథ‌లాజిక‌ల్ స్క్రిప్ట్ కావ‌డంతో?  పాన్ వ‌రల్డ్ కి క‌నెక్ట్ చేయాల‌న్న‌ది గురూజీ ప్లాన్. ఈ   సినిమా అనంత‌రం కోలీవుడ్ ద‌ర్శకుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ తో సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. `ఖైదీ`, `విక్ర‌మ్` లాంటి స‌క్స‌స్ లు..`లియో`, `కూలీ` లాంటి సినిమాల ఇమేజ్ చూసి లోకేష్ తో ఒక్క సినిమా అయినా తీయాల‌ని బ‌న్నీ ఉవ్విళ్లూరుతున్నాడు. లోకేష్ మార్క్ సినిమా చేయాల‌న్న‌దే బ‌న్నీ ప్లాన్.

ఇప్ప‌టికే ఇద్ద‌రి మ‌ధ్య స్టోరీ డిస్క‌ష‌న్స్ కూడా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఎల్ సీ యూలోకి బ‌న్నీ ఎంట‌ర్ అయిన ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. అలాగే `అర్జున్ రెడ్డి`, `యానిమ`ల్` విజ‌యాల‌తో పాన్ ఇండియాలో సంచ‌ల‌న‌మైన సందీప్ రెడ్డి వంగాతో కూడా బ‌న్నీ సినిమా ప్లానింగ్ ఉంది. ఇలా బ‌న్నీ పాన్ ఇండియా డైరెక్ట‌ర్లు అంద‌ర్నీ క్యూలో పెడుతున్నాడు. త‌న వెసులు బాటు..ద‌ర్శ‌కుల షెడ్యూల్ ని బ‌ట్టి ఐదారేళ్ల కాలంలో  వాళ్ల‌తో సినిమాలు పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు.

This is Bunny plan for the next five years:

Allu Arjun Future Plans

Tags:   ALLU ARJUN
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ