Advertisementt

అక్కినేని కోడలు శోభిత మెస్మరైజింగ్ లుక్

Sun 28th Dec 2025 09:59 AM
sobhita  అక్కినేని కోడలు శోభిత మెస్మరైజింగ్ లుక్
Sobhita Dhulipala mesmerizing look అక్కినేని కోడలు శోభిత మెస్మరైజింగ్ లుక్
Advertisement
Ads by CJ

హీరోయిన్ గా బోల్డ్ పాత్రలతో హైలెట్ అయిన వైజాగ్ అమ్మాయి శోభిత దూళిపాళ్ల ముందుగా బాలీవుడ్ లో తానేమిటో నిరూపించుకుని ఆతర్వాత తెలుగులోనూ ప్రూవ్ చేసుకుంది. గూఢచారి లో అడవి శేష్ తో రొమాన్స్ చేసిన శోభిత ఆతర్వాత అక్కినేని ఫ్యామిలీకి దగ్గరైంది. సమంత తో విడాకులు తీసుకుని ఒంటరివాడైన చైతు తో ప్రేమలో పడింది. 

గత ఏడాది డిసెంబర్ లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్న శోభిత దూళిపాళ్ల కెరీర్ లో బిజీగానే కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఫోటో షూట్స్, కొన్ని ప్రోడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా యాడ్ షూట్స్, సినిమా షూటింగ్స్ అంటూ నిత్యం బిజీగా కనిపిస్తుంది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అదిరిపోయే లుక్స్ షేర్ చేస్తుంది. 

తాజాగా అక్కినేని నాగార్జునకు కోడలిగా ఫ్యామిలిలో అందరికి దగ్గరైన శోభిత దూళిపాళ్ల డిఫ్రెంట్ చీరకట్టులో మెస్మరైజ్ చేసింది. గోల్డ్ కలర్ శారీ లో శోభిత అందాలు ఆరబోసింది. ప్రస్తుతం శోభిత న్యూ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. 

Sobhita Dhulipala mesmerizing look:

Sobhita Dhulipala stunning look

Tags:   SOBHITA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ