అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప 2 రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఆ సక్సెస్ తో అల్లు అర్జున్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ మొదలు పెట్టి సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. అయితే అల్లు అర్జున్ ని పుష్ప 2 ప్రీమియర్స్ తొక్కిసలాట ఘటన వదలడం లేదు. పుష్ప 2 ప్రీమియర్స్ రోజు సంధ్య థియేటర్స్ కి వెళ్లిన అల్లు అర్జున్ తో కలిసి సినిమా చూసేందుకు వచ్చిన వారిలో ఓ ఫ్యామిలీ లో భార్య మరణించడం, కొడుకు ఇంకా ఆసుపత్రి లోనే ఉండడం, అప్పట్లో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టి ఒకరోజు జైలులో ఉండేలా చేసారు.
ఈ కేసులో అల్లు అర్జున్ బెయిల్ పై విడుదల కాగా.. ఆతర్వాత శ్రీతేజ్ కి అన్ని విధాలుగా బన్నీ టీమ్ ఆదుకుంది. ఈ సంఘటన జరిగిన ఏడాదికి అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో అల్లు అర్జున్ పేరుని కూడా చేర్చారు.
ఈ కేసులో 23 మంది నిందితులను పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తొక్కిసలాట జరిగిందని నిర్ధారించిన పోలీసులు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ఏ1గా, హీరో అల్లు అర్జున్‌ను ఏ11గా చేర్చారు. అలానే బన్నీ మేనేజర్, ఆయన వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లపై ఛార్జ్ షీట్‌లో దాఖలైనట్లు తెలుస్తోంది.




అందుకే ఇంత సైలెంట్ గా రాజా సాబ్ ఈవెంట్ 
Loading..