పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని చూడాలని ప్రభాస్ అభిమానులు ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఆయన సినిమాలకు ఈవెంట్స్ నిర్వహిస్తే అభిమానులు కోకొల్లలుగా హాజరవుతారు. ఎప్పుడో కల్కి బుజ్జి ఈవెంట్ అప్పుడు పబ్లిక్ లోకి వచ్చిన ప్రభాస్ మళ్లీ ఇన్నాళ్లకు రాజాసాబ్ ఈవెంట్ లో కనిపించబోతున్నారు. ఈరోజు ద రాజసాబ్ ఈవెంట్ జరగబోతుంది.
అయితే ప్రభాస్ అభిమానులు రాజాసాబ్ ఈవెంట్ విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. రామోజీ ఫిలిం సిటీలోనో లేదంటే ఎల్బీ స్టేడియం లోనో రాజాసాబ్ ఈవెంట్ ఉంటుంది, ఉత్సాహంగా ఈవెంట్ కి వెళ్లొచ్చు, డార్లింగ్ ప్రభాస్ ని చూడొచ్చని వేలాదిమంది అభిమానులు ఆశపడ్డారు. కానీ రాజా సాబ్ ఈవెంట్ ని చాలా తక్కువమంది అంటే ఓ 8 వేలమంది పెట్టె గ్రౌండ్ లో మేకర్స్ ప్లాన్ చేయడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
కానీ మేకర్స్ పర్మిషన్స్ రాని కారణముగా రామోజీ ఫిలిం సిటీ కానీ, LB స్టేడియం కానీ, పోలీస్ గ్రౌండ్స్ కానీ తీసుకోలేకపోయామని, అందుకే ఖైతలపూర్ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ చేస్తున్నామని, కేవలం 8 వేల మంది మాత్రమే ఈ ఈవెంట్ కి హాజరవ్వమని మేకర్స్ విజ్ఞప్తి చెయ్యడమే కాదు, ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఈవెంట్ జరిగే చోటికి 4 గంటలకు రమ్మని, సెక్యూరిటీ చెక్ అన్ని చూసుకుని గ్రౌండ్ లోకి వెళ్ళమని, వృద్దులు, చిన్న పిల్లలు ఈవెంట్ కి రాకుండా ఉండమని మేకర్స్ తగిన జాగ్రత్తలు చెబుతున్నారు.




మహిళా కమిషన్ ముందుకు శివాజీ
Loading..