రీసెంట్ గా దండోరా సినిమా ఈవెంట్‌లో నటుడు శివాజీ హీరోయిన్స్ దుస్తులపై చేసిన కామెంట్స్ విషయంలో అనసూయ, చిన్మయి లాంటి వాళ్ళు శివాజీ కి మహిళల దుస్తులపై కామెంట్స్ చేసే అర్హత లేదు అన్నారు. మరోపక్క శివాజీ మహిళల దుస్తులపై చేసిన కామెంట్స్ విషయంలో ఆడవాళ్లే శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు.
కానీ శివాజీ తాను మాట్లాడిన మాటలపై ఇప్పటికే క్షమాపణ చెబుతూ వీడియో వదిలాడు. మరోసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చాడు. మహిళల వేషధారణపై శివాజీ అనుచిత వ్యాఖ్యలు చేశాడని నోటీసులు జారీ చేసింది మహిళా కమిషన్. దానిలో భాగంగా ఈరోజు శివాజీ మహిళా కమిషన్ ముందుకు హాజరయ్యాడు.
తను ఇప్పటికే మహిళలకు సారీ చెబుతూ వీడియో వదిలిన విషయాన్ని మహిళా కమిషన్ కు చెప్పనున్న శివాజీ. అంతేకాకుండా మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణ చెప్పనున్నట్లు సమాచారం




పరారీలో టాప్ హీరోయిన్ సోదరుడు
Loading..