ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ పరారీ అనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలోనూ అమన్ ప్రీత్ పేరు డ్రగ్స్ విషయంలో హైలెట్ అవ్వగా మరోమారు అమన్ ప్రీత్ పేరు అదే డ్రగ్స్ కేసులో వినిపించడం కలకలం సృష్టించింది. తనని అరెస్ట్ చేస్తారనే భయంతో అమన్ ప్రీత్ పరారీ అయిట్లుగా తెలుస్తుంది.
హైదరాబాద్ నగరంలో ఎప్పటికప్పుడు ఈ డ్రగ్స్ కేసులు నమోదు అవుతున్నా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్ విషయంలో ఎంత కఠినంగా ఉన్నా, ఈగల్ టీమ్ పేరుతొ పోలీసులు రైడ్స్ చేస్తున్నా, ఈ డ్రగ్ విషయం లో ఎలాంటి మార్పులు రావడం లేదు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో డ్రగ్స్ పార్టీలు, చేతుల మారడంపై పోలీసులు నిఘా ఎక్కువైంది.
తాజాగా నగరంలో మాసాబ్ ట్యాంక్ పోలీసులు తెలంగాణ ఈగల్ టీంతో నిర్వహించిన దాడుల్లో భారీగా కొకైన్ తో పాటు ప్రమాదకరమైన 43గ్రాముల ఎండిఎంఏ (MDMA) డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ట్రూప్ బజార్ కి చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ పేడ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు
వారికి రెగ్యులర్ కస్టమర్ల లిస్ట్ లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడని తేలడమే కాదు వీరి నుంచి అతను రెగ్యులర్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. దానితో అరెస్ట్ భయంతో అమన్ ప్రీత్ పరారీ అయినట్లుగా తెలుస్తుంది.




2025లో టాలీవుడ్ సాధించిందిదే
Loading..