తెలుగు సినిమా అంటే పాన్ ఇండియాలో ఎలాంటి గుర్తింపు ఉందో చెప్పాల్సిన పనిలేదు. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్`, `పుష్ప`, `సలార్`, ` కార్తికేయ-2`, `హనుమాన్`, లాంటి చిత్రాలు అంతటి ఇంపాక్ట్ ని ఇండియాలో తీసుకు రాగలిగాయి. అప్పటి నుంచి పాన్ ఇండియాలో తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే? ఆ సినిమా లెక్క ఎంత? అంటూ ట్రేడ్ వర్గాల్లో ఓ చర్చగా మారుతుంది. 1000 కోట్లు రాబడుతుందా? 1500 కోట్లు కొల్లగొడుతుందా? ఇలా కమర్శియల్ లెక్కలు నిత్య కృత్యంగా మారాయి.
మరి 2025 లో టాలీవుడ్ పాన్ ఇండియాలో సాధించింది ఏంటి? అంటే పెద్దగా లేదనే చెప్పాలి. కనీసం 500 కోట్ల వసూళ్ల సినిమా కూడా లేదు. `సంక్రాంతికి వస్తున్నాం`,` ఓజీ` లాంటి చిత్రాలు 300 కోట్ల వసూళ్లతో ఆగిపోయాయి. `మిరాయ్`, `హిట్ 3`, `డాకు మహారాజ్`, `కుబేర`, `అఖండ 2` లాంటి సినిమాలు 100 కోట్ల వసూళ్లతోనే సరిపె ట్టాయి. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ చిత్రాలివే.
కానీ బాలీవుడ్ , శాండిల్ వుడ్, కోలీవుడ్ పరిశ్రమలు మాత్రం మోత మ్రోగించింయానే చెప్పాలి. మూడు పరిశ్రమల నుంచి 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చిత్రాలున్నాయి. రిషబ్ శెట్టి నటించిన `కాంతార చాప్టర్ 1` ఏకంగా 800 కోట్ల వసూళ్లను సాధించింది. అలాగే కోలీవుడ్ నుంచి రజనీకాంత్ నటించిన `కూలీ` నెగిటివ్ టాక్ తె చ్చుకున్నా 500 కోట్ల వసూళ్లతో ముందంజలో ఉంది. సౌత్ నుంచి ఈ రెండు సినిమాలు టాప్ గ్రాసర్ గా నిలిచాయి.
బాలీవుడ్ నుంచి రిలీజ్ అయిన `ఛావా`, `సయ్యారా` కూడా 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించినవే. `ఛావా` 800 కోట్ల వసూళ్లను సాధించింది. ఈమధ్యనే రిలీజ్ అయిన `ధురంధర్` ఇప్పటికే 800 కోట్లకు పైగా వసూళ్లను సాధిం చింది. ఇంకా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా దూకుడు కొనసాగిస్తోంది. దీంతో 2025 ముగిసేలోగా 1000కోట్ల క్లబ్ లో `ధురంధర్` చేరుతుందనే అంచనాలున్నాయి స్ట్రాంగ్ గా ఉన్నాయి.నా కాన్ఫిడెన్స్ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి చూసాక కొంచెం ధైర్యం తెచ్చుకున్నాను, 99.99% హిట్ కొడతాం ఇది గ్యారంటీ. 2025 ఫస్ట్ హాఫ్ లో ఉన్న వంశీ అయితే నా స్టైల్ లో చెప్పే వాడిని.. ఇప్పుడు 2025 సెకండ్ హాఫ్ లో ఉన్నా కాబట్టి తగ్గి చెప్తున్నా. ఆ వంశీ మళ్లీ సంక్రాంతి తర్వాత బయటకు వస్తాడు అంటూ నాగవంశీ రవితేజ భక్తమహాశయులకు విజ్ఞప్తి తో గ్యారెంటీ హిట్ కొడుతున్నాం అంటూ అంచనాలు పెంచేసాడు.




మూడు వారాల్లోపే ఓటీటీలోకి మోగ్లీ 
Loading..