Advertisementt

ఆ విషయంలో నా ఫ్యామిలీ హ్యాపీ - రష్మిక

Sat 27th Dec 2025 06:47 PM
rashmika  ఆ విషయంలో నా ఫ్యామిలీ హ్యాపీ - రష్మిక
My family is happy about that matter - Rashmika ఆ విషయంలో నా ఫ్యామిలీ హ్యాపీ - రష్మిక
Advertisement
Ads by CJ

నేషనల్ క్రష్ రష్మిక కి ఈ ఏడాది నిజంగా చాలా ప్రత్యేకం. కెరీర్ లోనే కాదు అటు వ్యక్తిగంతంగాను ఆమెకు 2025 ప్రత్యేకం కాబోతుంది. కెరీర్ లో సౌత్ నుంచి నార్త్ వరకు సూపర్ హిట్స్, ఇక పర్సనల్ లైఫ్ లో తను మెచ్చిన హీరో విజయ్ దేవరకొండ ను ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి రెడీ అవుతుంది. 

తాజాగా రష్మిక ఓ ఇంటర్వ్యూలో మట్లాడుతూ.. 2025 నాకు చాలా స్పెషల్, ఈ ఏడాది నన్ను చాలా శాటిస్ఫాయ్ చేసింది. నిజంగా ప్రతి ఏడాది ఇలానే ఇంత సక్సెస్ ఫుల్ గా ఉంటుందని చెప్పలేను. కానీ ఈ సంవత్సరం నాకు చాలా ప్రత్యేకం. నేను చేసిన పనుల పట్ల నా ఫ్యామిలీ ఇంకా ఫ్రెండ్స్ సంతోషంగా ఉండటాన్ని చూసి నాకు మరింత ఆనందం కలిగింది. 

ఇక ఆడియన్స్ నుంచి, అభిమానుల నుంచి లభించిన ప్రేమే నాకు అసలైన విజయం. ఒకే రకమయిన పాత్రలకు పరిమితం కాకుండా విభిన్నమైన పాత్రలతో అలరించాలనేది నా కోరిక. రియల్ లైఫ్ లో నేను ఎలా ఉంటానో, స్క్రీన్ పై కనిపించే కేరెక్టర్స్ మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ తేడానే నటిగా నాకు బలంగా మారాలి అంటూ రష్మిక ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 

My family is happy about that matter - Rashmika:

Rashmika Mandanna on having a successful 202

Tags:   RASHMIKA
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ