యంగ్ హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టి కెరీర్ లో ఎదిగేందుకు రెడీ అయిన నటుడు శ్రీకాంత్ మేక కొడుకు రోషన్ మేక ఈరోజు డిసెంబర్ 25 క్రిష్టమస్ సందర్భంగా టాలీవుడ్ లో బిగ్ బ్యానర్ అయిన స్వప్న మూవీస్ నుంచి ఛాంపియన్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరో మెటీరియల్ అయినా, నట వారసుడు అయినా రోషన్ మేక కి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు.
గత కొన్ని రోజులుగా రోషన్ మేక ఛాంపియన్ ప్రమోషన్స్ తో హడావిడి చెయడమే కాదు ఛాంపియన్ మూవీపై మొదటినుంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ఇక ఈరోజు విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ బావుంది అంటూ సోషల్ మీడియాలో ఆడియన్స్ వేస్తున్న ట్వీట్ల తో రోషన్ మేక సోషల్ మీడియా ట్విట్టర్ X లో ట్రెండింగ్ లోకి వచ్చాడు.
ఛాంపియన్ గా రోషన్ మేక యాక్టింగ్, రోషన్ లుక్స్ బావున్నాయని, సినిమా సూపర్ అంటూ సోషల్ మీడియాలో ఆడియన్స్ ట్వీట్లు వేస్తున్నారు. రోషన్ మేక ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ లో ఛాంపియన్ వీక్షించేందుకు వెళ్లిన వీడియోస్, సినిమా చూసాక #Champion - Solid Watch👍 అంటూ వేస్తున్న ట్వీట్ల తో ఈ యువ హీరో ట్విట్టర్ X లో ట్రెండ్ అవుతున్నాడు.




ఈసారి హీరో బూతులు గోదారి యాసలోనా
Loading..