ఆది సాయి కుమార్ కెరీర్ లో సక్సెస్ కోసం స్ట్రగుల్ అవుతున్న హీరో. ఈ హీరో ఇప్పుడు శంబాల అంటూ డిసెంబర్ 25 క్రిష్టమస్ కి ఆడియన్స్ ని పలకరించాడు. శంబాల చిత్ర ప్రమోషన్స్ తోనే సినిమాపై మంచి అటెన్షన్ క్రియేట్ చేసింది టీమ్, ఆది సాయి కుమార్ ఇంకా టీమ్ సినిమాని ప్రమోషన్స్ చేసిన తీరు, అలాగే శంబాల కంటెంట్ అన్ని సినిమాపై ఇంట్రెస్ట్ పెంచేసాయి.
శంబాల విడుదలకు ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ తో కనిపించింది. ప్రీమియర్స్ తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న శంబాల చిత్రానికి ఈరోజు మంచి క్రేజ్ కనిపిస్తుంది. శంబాల బావుంది అంటూ సోషల్ మీడియా టాక్, అలాగే ప్రీమియర్స్ టాక్ అన్ని సినిమా పై ఆసక్తిని క్రియేట్ చేసాయి.
శంబాల కొచ్చిన పాజిటివ్ క్రేజ్ ఆ చిత్ర థియేటర్స్ ని ఫుల్ చేసింది. చాలా రోజుల తర్వాత ఆది సాయి కుమార్ చిత్రానికి థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. విజయనగరం సప్తగిరి థియేటర్ దగ్గర హాలు నిండినది, హౌస్ ఫుల్ బోర్డు చూసిన వారు అది సాయి కుమార్ శంబాల క్రేజ్ చూసారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.




X లో ట్రెండ్ అవుతున్న కుర్ర హీరో 
Loading..