సినిమాకిప్పుడు సెన్సార్ తో పనిలేదు. A సర్టిఫికెట్ వచ్చినా కళ్లకు హత్తుకుని ఎంచక్కా తీసుకుని సినిమా రిలీజ్ చేసుకుంటున్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలు రాపోయినా పర్వాలేదు. పెద్ద వాళ్లు వస్తే చాలు సినిమా హిట్ అవుతుంది అన్న ధీమాతో UA కంటే A సర్టిపికెట్ ఇస్తే ఎంతో ఉత్తమంగా భావిస్తున్నారు. ఈనేపథ్యంలో దర్శకులు కూడా ఎక్కడా రాజీ పడటం లేదు. సన్నివేశం పరంగా వీలైనంత రాగా చూపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన రౌడీజనార్దన గ్లింప్స్ లో విజయ్ దేవరకొండ మాస్ లుక్ ఎంత హైలైట్ అయిందో తెలిసిందే.
రవికిరణ్ కోలా ఈసారి విజయ్ తో కొత్త తరహాలో ప్రయత్నం చేస్తున్నాడు. గోదారి జిల్లాలో ఉండే రౌడీయిజాన్ని హైలైట్ చేస్తున్నాడు. ఇంత వరకూ రాయలసీమ ఫ్యాక్షన్..తెలంగాణ రౌడీయిజం.. వైజాగ్ నేపథ్యంలోనే సినిమాలు వచ్చాయి. వాటిలో వీలైనన్న రా కాన్సెప్ట్ లు చూపించారు. కానీ గోదారి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలంటే ఓ క్లాసిక్ గానే హైలైట్ అయ్యాయి. గోదారి అందాలు.. అక్కడ కుటుంబాల మధ్య అన్యోన్యత.. పచ్చదనం వంటివి మాత్రమే హైలైట్ అయ్యాయి.
గోదారోళ్ల మధ్య రా మెటీరియల్ మాత్రం తెరపైకి రాలేదు. రవి కిరణ్ కోలా అలాంటి కాన్సెప్ట్ నే తీసుకుని రౌడీ జనార్దన తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా బూతు డైలాగులు భారీగానే ఉంటాయని తెలిసింది. అయితే వాటిలో కూడా ఎంతో హాస్యం ఉంటుంది. వాటికి గోదారి స్లాంగ్ తోడైతే? రెట్టింపు హాస్యం పండుతుంది. మరి అవి విజయ్ దేవరకొండ నోట ఎంత వరకూ వర్కౌట్ అవుతాయో చూడాలి. అర్జున్ రెడ్డి లో బూతు డైలాగులు కొన్ని ఉంటాయి.
అంతకు ముందు నటించిన పెళ్లి చూపులు చిత్రంలో తెలంగాణ స్లాంగ్ లోనూ బాగా కనెక్ట్ అయ్యాడు. అతడికి ఆ స్లాంగ్ నటుడిగా ఎదగడానికి ఎంతగానో కలిసొచ్చింది. చాలా సినిమాలకు ఆ స్లాంగ్ వర్కౌట్ అయింది. ఏపీలో విజయ్ కనెక్ట్ అవ్వడానికి కారణం ఆ స్లాంగ్ అనే చెప్పాలి. తాజాగా రౌడీజనార్దన లో అందుకు భిన్నమైన గోదారి స్లాంగ్ ట్రై చేస్తున్నాడు. ఈ స్లాంగ్ గనుక తెలంగాణ రీజియన్ లో క్లిక్ అయితే అక్కడ ప్రేక్షకులకు కొత్త అను భూతినిస్తుంది. విజయ్ స్టార్ డమ్ రెట్టింపు అవుతుంది.




బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ కి ఆదిరెడ్డి సలహాలు
Loading..