ప్రముఖ గాయకుడు స్లెబిన్ బెన్‌తో కృతి సనోన్ సోదరి నూపుర్ సనోన్ కొంతకాలంగా డేటింగ్ లో ఉందంటూ పుకార్లు వచ్చాయి. అయితే ఈ పుకార్లను ఈ అందమైన జోడీ ఖండించనూ లేదు... అలాగని డేటింగ్ ని కన్ఫామ్ చేయనూ లేదు. నూపూర్ ప్రస్తుతం మోడల్ గా, నటిగా రాణిస్తోంది. ఇలాంటి సమయంలో తన డేటింగ్ వ్యవహారంపై ఎలాంటి ప్రకటనా చేయకుండా ప్రయివేట్ గా ఉంచింది.
తాజా సమాచారం మేరకు.. నూపూర్ తన బోయ్ ఫ్రెండ్ స్టెబిన్‌ని పెళ్లాడేందుకు సిద్ధమవుతోంది. జనవరి 11న ఈ జంట వివాహం ఉదయ్ పూర్ లోని విలాసవంతమైన వెన్యూలో జరగనుంది. జనవరి 9 నుంచి 11 వరకూ మూడు రోజుల వెడ్డింగ్ వేడుకలకు షెడ్యూల్ ఖరారైందని తెలిసింది.
ఈ పెళ్లి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరగనుండగా జనవరి 13న ముంబైలో భారీ రిసెప్షన్ ఉంటుందని, ఈ రిసెప్షన్ కి పరిశ్రమ సన్నిహితులందరినీ కృతి- నూపూర్ సిస్టర్స్ ఆహ్వానించనున్నారని కూడా తెలుస్తోంది. ఇక ఉదయ్ పూర్ లో పెళ్లికి భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. గాయకుడు స్టెబిన్ బెన్ ఇటీవలే తాను కెరీర్ పరంగా బిజీగా ఉన్నానని, డేటింగులకు వెళ్లే సమయం లేదని ప్రకటించాడు.. కానీ అందుకు విరుద్ధంగా అతడి డేటింగ్ రహస్యం బయటపడిపోయింది. నూపూర్ ని పెళ్లాడేందుకు అతడు సంసిద్ధంగా ఉన్నాడు.




NBK111 పై సాయి మాధవ్ బుర్రా ఎలివేషన్
Loading..