Advertisementt

రాజాసాబ్ సెన్సార్ టాక్

Tue 23rd Dec 2025 09:37 PM
the raja saab  రాజాసాబ్ సెన్సార్ టాక్
The Raja Saab censor details out రాజాసాబ్ సెన్సార్ టాక్
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతి కలయికలో హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ద రాజాసాబ్ జనవరి 9 న సంక్రాంతి స్పెషల్ గా విడుదల కాబోతుంది. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రభాస్ కేరెక్టర్ ని అభిమానులు ఇష్టపడుతున్నారు. ఇకపై రాజాసాబ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చెయ్యబోతున్నారు మేకర్స్. 

తాజాగా రాజాసాబ్ సెన్సార్ పూర్తయ్యింది. ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేసారు. ద రాజా సాబ్ రన్ టైమ్ 186 నిముషాలు అంటే మూడుగంటల ఆరు నిమిషాల భారీ నిడివితో రాజాసాబ్ విడుదలకాబోతుంది. ద రాజాసాబ్ సెన్సార్ టాక్ లోకి వెళితే సినిమా ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ గాఉండబోతుంది అని తెలుస్తుంది. 

ప్రభాస్ కామెడీ టైమింగ్ అదిరిపోతోంది అని, అంతేకాకుండా హీరోయిన్స్ తో ప్రభాస్ కెమిస్ట్రీ బావుంది అంటున్నారు. ఈ టాక్ చూసాక జనవరి 9 న రాబోతున్న రాజాసాబ్ కోసం అభిమానులు కళ్ళల్లో వత్తులు వేసుకుని వెయిట్ చెయ్యాల్సిందే. 

The Raja Saab censor details out:

Here is the inside out of The Raja Saab censor

Tags:   THE RAJA SAAB
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ