అగ్నిపరీక్షలో నెగ్గినా బిగ్ బాస్ హౌస్ లో ఎలా మెలగాలో తెలియని, ఎలా ఆడాలో తెలియని వ్యక్తితో స్నేహం చేసి అతన్ని ట్రోఫీ వరకు నడిపించి తనూజ తప్పు చేసిందా, ఇప్పుడు అదే ఆమె అభిమానుల్లో, ఆమె స్నేహితుల్లో మెదులుతున్న అసహనం. కళ్యాణ్ పడాల అనే వ్యక్తి అగ్నిపరిక్షలో గెలిచినా బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాలకే ఎలిమినేట్ అవ్వాల్సినవాడు ఈరోజు ట్రోఫీ ఎత్తడానికి కారణం తనుజనే.
అదే ఆమెను టైటిల్ రేస్ నుంచి వెనక్కి నెట్టింది. తనూజ విన్నర్ నుంచి రన్నర్ అవ్వడానికి కారణమైంది. తనూజ కూడా కొన్ని తప్పు చేసి ఉండొచ్చు. కానీ కళ్యాణ్ పడాల ను మోటివేట్ చేసి ఆమె విజయాన్ని ఆమె చేజార్చుకుంది అనేది ఆమె స్నేహితుల బాధ. మూడో వారంలో కళ్యాణ్ పడాల డేంజర్ జోన్ లోకి వచ్చాడు. తనూజ తో కలిసి ఆడిన టాస్క్, ఆతర్వాత ఆమెకు దగ్గరై స్నేహం చేసాడు. తనూజ బాండ్స్ అంటూ భరణి, స్నేహతుడు ఇమ్మాన్యుయేల్ ని పక్కనపెట్టి కళ్యాణ్ ని నెత్తిన పెట్టుకుంది.
ఆ రోజే భరణి, ఇమ్మాన్యుయేల్ లు తనూజ ని చూసి షాకయ్యారు. ఆతర్వాత నా ఆట మార్చుకోవాలా, సజెస్ట్ చెయ్యి అంటూ తనూజ తో లవ్ బాండ్ పెట్టుకుని ఎలాగైనా టాప్ లోకి వెళ్లాలని ప్లాన్ చేసిన కళ్యాణ్ ని తనూజ అంత దూరం వెళ్లనివ్వకుండా స్నేహం దగ్గరే ఆపింది. కానీ చివరి వరకు కళ్యాణ్ కి స్టాండ్ తీసుకోవడం ఆమె చేసిన తప్పు అంటున్నారు.
తనూజ వల్లే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ గెలిచాడు. తనూజ లేకపోతె కళ్యాణ్ అనేవాడు లేడు. ఆటలో డిమోన్ పవన్ కన్నా తక్కువ, తెలివిలో ఇమ్మన్యుయెల్ కన్నా తక్కువగా ఉన్న కళ్యాణ్ అనేవాడు కప్పు గెలిచాడు అంటే అది ముమ్మాటికీ తనూజా వల్లే. తనూజ గ్రాఫ్ తగ్గడానికి ఆమె అభిమానులు కళ్యాణ్ కి ఓట్లు వేయడానికి తనూజనే కారణమంటూ చెప్పుకుంటున్నారు.




జనవరి 9, 12, 13, 14 డేట్స్ ఫుల్ అయ్యాయి
Loading..