Advertisementt

జనవరి 9, 12, 13, 14 డేట్స్ ఫుల్ అయ్యాయి

Mon 22nd Dec 2025 04:45 PM
pongal  జనవరి 9, 12, 13, 14 డేట్స్ ఫుల్ అయ్యాయి
Sankranthi 2026 జనవరి 9, 12, 13, 14 డేట్స్ ఫుల్ అయ్యాయి
Advertisement
Ads by CJ

ఈ పొంగల్ కి పోటీ మాములుగా లేదు. సంక్రాంతికి కోడిపుంజులు ఎంతగా కొట్టుకుంటాయో బాక్సాఫీసు దగ్గర అంతగా హీరోలు పోటీపడతారు. సంక్రాంతి సెలవలు సినిమాలకు బిగ్ మార్కెట్. అందుకే సంక్రాంతి సీజన్ ను అవకాశం ఉన్న ఏ హీరో వదులుకోవడానికి సిద్ధం అవరు. 2026 సంక్రాంతికి క్రేజీ ఎంటెర్టైనెర్స్ పోటీకి సై అంటున్నాయి.

అందులో ముందుగా జనవరి 9 న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాజాసాబ్ తో రాబోతున్నారు. ఆ సినిమా వచ్చిన మూడు రోజులకు మెగాస్టార్ చిరు జనవరి 12 న మన శంకరవరప్రసాద్ గారు తో రాబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి అచ్చొచ్చిన సంక్రాంతి కి హిట్ కొట్టాలని చూస్తున్నారు. 

ఆతర్వాత రోజు అంటే జనవరి 13 న మాస్ మహారాజ్ భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ కామెడీ ఎంటర్టైనర్ తో రాబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇక భోగి రోజున అంటే జనవరి 14 న శర్వానంద్ నారి నారి నడుమమురారి చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. మరి జనవరి 9, 12, 13, 14 డేట్స్ లాక్ అయ్యాయి. ఇక నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు చిత్రానికి రిలీజ్ డేట్ ఇవ్వాలి.

టాలీవుడ్ మూవీస్ తో పాటుగా కోలీవుడ్ నుంచి విజయ్ జన నాయగన్ అలాగే శివకార్తికేయన్ పరాశక్తి సినిమాలు కూడా పొంగల్ నే టార్గెట్ చేస్తున్నాయి.   

Sankranthi 2026:

Pongal 2026

Tags:   PONGAL
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ