బిగ్ బాస్ సీజన్ 9 లోకి సెలెబ్రిటీ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన బుల్లితెర నటి కన్నడ అమ్మాయి తనూజ.. మూడు నాలుగు వారాల్లోనే బిగ్ బాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆమె మాట తీరుకి, డ్రెస్సింగ్ స్టయిల్ కి అందరూ ఇష్టపడ్డారు, ఆమెకి సపోర్ట్ చేశారు. నామినేషన్స్ లోకి వచ్చిన ప్రతిసారి ఆమెకి సపోర్ట్ చేసారు. విన్నర్ గా నిలబెట్టాలనుకున్నారు.
టాప్ 5 కోసం కష్టపడి ఆడి సెకండ్ ఫైనలిస్ట్ అయినట్లే.. టాప్ 2 లో ఉన్న తనూజ రన్నర్ గా మిగిలిపోయింది. అయితేనేమి ఆమె 15 వారాలకు గాను బాగానే సంపాదించింది. విన్నర్ ప్రైజ్ మనీ లో డిమోన్ పవన్ రూ.15 లక్షలు పట్టుకుపోగా.. విన్నర్ కళ్యాణ్ పడాల కి రూ.35 లక్షల క్యాష్, ఒక కారు, ఓ రూ.5 లక్షల గిఫ్ట్ వోచర్ గెలిచాడు. ఇక వారానికి రూ.70 వేల వరకు కళ్యాణ్ పడాల పారితోషికం అందుకున్నట్టుగా తెలుస్తుంది.
అయితే తనూజ ఈ 15 వారాలకు గాను గట్టిగా సంపాదించింది. ఓటమి వెనుక ఎంతటి నిరాశ ఉన్నా, పారితోషికం విషయంలో మాత్రం విన్నర్ స్థాయికి మించి రెమ్యునరేషన్ అందుకుంది అంటున్నారు. తనూజకు వారానికి సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.2.8 లక్షల వరకు బిగ్ బాస్ యాజమాన్యం రెమ్యునరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అలా ఆమె 15 వారాలు హౌస్‌లో కొనసాగినందుకు గాను మొత్తం రూ.37.5 లక్షల నుంచి రూ.42 లక్షల వరకు సంపాదించినట్టుగా తెలుస్తుంది.




ట్రోఫీ గెలవకపోయినా మనసులు గెలిచింది 
Loading..