Advertisementt

ఈ క్రిస్మస్ కి ఆ హీరోల మధ్య క్రేజీ ఫైట్

Mon 22nd Dec 2025 12:19 PM
chadarangam  ఈ క్రిస్మస్ కి ఆ హీరోల మధ్య క్రేజీ ఫైట్
Aadi Saikumar vs Roshan Meka ఈ క్రిస్మస్ కి ఆ హీరోల మధ్య క్రేజీ ఫైట్
Advertisement
Ads by CJ

ఈ క్రిస్మస్ కి పెద్ద హీరోలెవరు బాక్సాఫీసు ఫైట్ కి రెడీ అవ్వలేదు. క్రిస్మస్ తప్పించి అందరూ వచ్చే ఏడాది సంక్రాంతి పై కన్నేశారు. ఈ క్రిస్మస్ కి కుర్ర హీరోలతో పాటుగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన వృషభ విడుదల కాబోతుంది. అయితే ముఖ్యంగా టాలీవుడ్ లో ఇద్దరు హీరోల మద్యన ఈ క్రిస్మస్ ఫైట్ ఉండబోతుంది. 

సాయి కుమార్ తనయుడు, హీరో ఆది సాయి కుమార్ నటించిన శంబాల తో పాటుగా నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ నటించిన చదరంగం సినిమాలు డిసెంబర్ 25 న క్రేజీ ఫైట్ కి సిద్ధమయ్యాయి. వాటితో పాటుగా దండోరా, పతంగ్, ఈషా, వృషభ, మార్క్ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. 

అయితే ఈ క్రిష్టమస్ ఫైట్ మాత్రం ఆది సాయికుమార్ శంబాల, రోషన్ చదరంగం మధ్యనే ఉండబోతుంది. అటు బాక్సాఫీసు దగ్గరే కాదు ఇటు ప్రమోషన్స్ లోను రెండు టీమ్స్ పోటీపడుతున్నాయి. శంబాల కు అన్ని వైపులా నుంచి పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ఇక రోషన్ చదరంగం పైన కూడా మంచి క్రేజ్ కనిపిస్తుంది. 

మరి ఈ క్రిస్మస్ ఫైట్ లో ఏ హీరో నెగ్గుతాడో, ఏ హీరో ఆడియన్స్ ను ఇంప్రెస్స్ చేస్తాడో చూడాలి. 

Aadi Saikumar vs Roshan Meka:

Shambhala vs Chadarangam

Tags:   CHADARANGAM
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ