బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది. సీజన్ 9 ట్రోఫీ ని కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల ఎగరేసుకుపోయాడు. కళ్యాణ్ పడాల బిగ్ బాస్ విన్ అవ్వడానికి తనూజనే ప్రధానకారణం. ఆమె మోటివేషన్ వల్లే కళ్యాణ్ ఈరోజు విన్నర్ గా నిలిచాడు. కళ్యాణ్ కూడా చాలాసార్లు, ఈవెన్ బిగ్ బాస్ స్టేజ్ పై కూడా తన గెలుపుకి కారణం తనూజ అని చెప్పాడు. అయితే గత కొన్ని వారాలుగా తనూజ టైటిల్ రేస్ లోకి వచ్చేసింది.
ఆమె మాట తీరు, ఆట, ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ కి అభిమానులు ఫిదా అయ్యారు. అందుకే తనూజ కి ఓట్లేసి గెలిపిద్దామనుకున్నారు. కాని ఫ్యామిలీ వీక్ తర్వాత అనూహ్యంగా కళ్యాణ్ పడాల టైటిల్ రేస్ లో తనూజ కి గట్టి పోటీ ఇస్తూ వచ్చాడు. ఆఖరి వారం వరకు తనూజ vs కళ్యాణ్ పడాల అన్న రేంజ్ లో ఓట్లు హోరాహోరీగా పడ్డాయి. వోటింగ్ లో జస్ట్ ఒకటి రెండు శాతం తప్ప మధ్యలో వేరియేషన్ కూడా పెద్దగా లేదు. అందుకే టైటిల్ గెలుపు ఎవరిదో అనే క్యూరియాసిటీ అందరిలో నడిచింది.
తనూజ మాట తీరు, ఆమె స్నేహాలు, ఆమె బెండింగ్స్ అన్ని ఆమెను టైటిల్ కి దగ్గర చేసాయి. కళ్యాణ్ తన ఫ్రెండ్ అయినా.. అతనికి ఆమె సపోర్ట్ చేసింది. ఈరోజు తనూజ బిగ్ బాస్ ట్రోఫీ గెలవకపోయినా ఆమె ఆడియన్స్ మనసులు గెలుచుకుంది అదే ఇప్పడు ఆమె అభిమానులు ఆమెకి ఇస్తున్న భరోసా.
టైటిల్ ఎవరైనా గెలుస్తారు, కానీ అభిమానుల మనసులో చోటు అనేది కొంతమందే సంపాదించుకుంటారు అంటూ తనూజాకి వారు అండగా నిలబడుతున్నారు.




ఇకపై తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా.. 
Loading..