Advertisementt

ఇకపై తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా..

Mon 22nd Dec 2025 10:22 AM
kcr  ఇకపై తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా..
BRS president KCR ఇకపై తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా..
Advertisement
Ads by CJ

ఇప్పటివరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని కేటీఆర్ ధీటుగా ఎదుర్కోలేకపోతున్నాడు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండిపోవడం, తర్వాత కాలు విరగడం, అసెంబ్లీ సమావేశాలకు రాకుండా సైలెంట్ అవడం, ఏ విషయమైనా, ఏ చర్చ అయినా ఫామ్ హౌస్ లోనే కానివ్వడంతో కేసీఆర్ ఇకపై ఫామ్ హౌస్ నుంచే రాజకీయాలు నడుపుతారని అనుకున్నారు. 

ఆఖరికి ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలోను కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండి  బాధ్యతలన్నీ కొడుక్కి అప్పగించి వెనకుండి నడిపించారు. దానితో రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ నుంచి బయటికి రారు కేసీఆర్ అంటూ సెటైర్స్ వేసేవారు. కానీ ఇప్పడు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసంలో దిగడమే కాదు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలతో కలిసి మీటింగ్ పెట్టారు. అంతేకాదు రేవంత్ రెడ్డి కి కౌంటర్లు కూడా వేశారు. 

పదేళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ గత రెండేళ్లుగా యాక్టీవ్ గా కనిపించలేదు. కానీ ఇప్పుడు ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి దిగారు. ఇకపై తెలంగాణాలో కేసీఆర్ vs రేవంత్ రెడ్డి అంటూ రసవత్తర రాజకీయాలు మొదలు కానున్నాయనిపిస్తుంది. చూద్దాం అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ తో రేవంత్ రెడ్డి ఎలా ఢీ కొట్టబోతున్నారో అనేది. 

BRS president KCR:

K Chandrashekhar Rao

Tags:   KCR
Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ